ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుదైన సంఘటన.. అప్పుడే పుట్టిన బాలుడి నోట్లో రెండు దంతాలు.. కారణమేంటంటే..!

ABN, First Publish Date - 2022-12-12T18:55:11+05:30

బీహార్ (Bihar)లోని జమూయిలో చిన్నారికి పుట్టుకతోనే రెండు దంతాలు ఉన్నాయి. నవజాత శిశువు నోటిలో దంతాలు చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పిల్లవాడికి కింది పళ్ల వరసలో రెండు దంతాలు ఉన్నాయి. బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్ (Bihar)లోని జమూయిలో చిన్నారికి పుట్టుకతోనే రెండు దంతాలు ఉన్నాయి. నవజాత శిశువు నోటిలో దంతాలు చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పిల్లవాడికి కింది పళ్ల వరసలో రెండు దంతాలు ఉన్నాయి. బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అలీగంజ్ బ్లాక్‌లోని మీర్జాగంజ్ ప్రాంతానికి చెందిన ఉత్తమ్ కుమార్ భార్య నీలం కుమారి (22) సోమవారం ఉదయం జాముయి సదర్ ఆసుపత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఆమె బిడ్డకు పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా.. పిల్లవాడు పాలు తాగలేకపోయాడు. దీంతో బిడ్డ నోరు తెరిచి చూడగా రెండు దంతాలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లి కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు దంతాలు వస్తాయని డాక్టర్ చెప్పారు. పుట్టుకతోనే దంతాలు ఉండడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావమూ ఉండదని డాక్టర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-12T18:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising