ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్యనీతి: మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఈ 4 గుణాలను తప్పక అలవరుచుకోండి!

ABN, First Publish Date - 2022-01-14T12:14:34+05:30

ఎవరికైనాసరే రోజుకు 24 గంటలే ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరికైనాసరే రోజుకు 24 గంటలే ఉంటాయి. ఈ 24 గంటలను సద్వినియోగం చేసుకునేవారు తమ కలలను సాకారం చేసుకుంటారని ఆచార్య చాణక్య తెలిపారు. అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఈ 4 గుణాలను అలవరుచుకోవాలని ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. కర్మను నమ్మండి

జీవితంలో విజయం, అదృష్టం అనేవి మనం చేసే కర్మ ఆధారంగా లభిస్తాయని ఆచార్య చాణక్య తెలిపారు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటే సరిపోదు. మనిషికి కర్మను చేసే శక్తిని భగవంతుడు అందించాడు. అదృష్టం మీద ఆధారపడి కర్మను విస్మరించకండి. మీరు  సాధించాలనుకుంటున్న లక్ష్యం కోసం సరైన మార్గంలో కర్మ చేస్తుండండి. పనిలో పూర్తి అంకితభావంతో కష్టపడి పనిచేస్తే.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

2. నిజాయితీగా ఉండండి

ఏ పనిలోనైనా నిజాయితీ చాలా ముఖ్యం. మీరు చేసే పనిలో నిజాయితీ లేకపోతే ఎప్పటికీ విజయం సాధించలేరు. ఒక వ్యాపారవేత్త తన పనిని నిజాయితీగా చేయకపోతే, అపజయాలు అతనిని చుట్టుముడతాయి. 

3. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి

జీవితంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని విజయంవైపు నడిపిస్తాయి. అందుకే ఏ నిర్ణయమైనా ఎంతో ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి. అలా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకోండి. ఆ తరువాతే తగిన నిర్ణయాన్ని తీసుకోండి. నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి.

4. ధార్మిక పనులు చేయండి

ఒక వ్యక్తి తన జీవితంలో తప్పనిసరిగా ధార్మిక కార్యకలాపాలు చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు. ధర్మ కార్యాలు చేయడం ద్వారా ఆ వ్యక్తి చేసే చెడు కర్మల ప్రభావాలు తగ్గుతాయి. అప్పుడు అదృష్టం కూడా అతనికి కలసివస్తుంది. ఫలితంగా జీవితంలో విజయం అనేది చేరువవుతుందని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-01-14T12:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising