ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: విజయం మిమ్మల్ని అనుక్షణం ముద్దాడాలంటే ఇలా జీవించండి!

ABN, First Publish Date - 2022-04-14T12:49:44+05:30

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం జీవితంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవడం చాలా ముఖ్యం.  సద్గుణవంతుల ప్రవర్తన, భాష, మాటలు అందరినీ ఆకర్షిస్తాయి. మీరు జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు తెలిపిన ఈ విషయాలు జీవితంలో అమలు చేయాలి. చాణక్య నీతిలో మనిషి జీవితంలో విజయవంతం కావడానికి చాలా విషయాలు ప్రస్తావించారు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా మనిషి తన జీవితంలో అమోఘమైన విజయాలను సాధించగలుగుతాడు. అలాగే జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతాడు. ఆచార్య చాణక్యగా పేరుగాంచిన విష్ణుగుప్తుని మాటల్లో ఎన్నో జీవిత రహస్యాలు దాగున్నాయి. జీవితంలో విజయం సాధించడానికి చాణక్య ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. అత్యాశ అనేది మనిషిపై అనవసరమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. మనిషిని స్వార్థపరుడిని చేస్తుంది. అనేక తప్పుడు పనులకు పురిగొల్పుతుంది. అత్యాశ కలిగిన మనిషి వివాదాల్లో చిక్కుకుని తీవ్రమైన ఒత్తిడికి గురవుతాడు. 

2. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం అపజయం, భయం అనేవి మనిషి మనసులో ఆధిపత్యం చెలాయిస్తే అతను దిగులు పడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధించలేడు. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే మీ మనసులో పేరుకుపోయిన భయాలను తొలగించుకోండి.

3. మనిషి అహంకారానికి దూరంగా ఉండాలి. ఇది మనిషిని వాస్తవికత నుండి దూరం చేయడమే కాకుండా అతని సామర్థ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. దీని కారణంగా అతను అనవసరంగా అనేక సమస్యలను, ఒత్తిడిని ఎదుర్కొంటాడు.

4. అత్యంత నిజాయితీతో వ్యవహరించాలనుకునేవారు అప్పుడప్పుడు తమకు తామే హాని చేసుకుంటారు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా మనిషి నడుచుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు.

Updated Date - 2022-04-14T12:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising