ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్ ఇంజన్ కారులో పెట్రోలు పోస్తే ఏమవుతుంది?.. ఇలా జరిగితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ABN, First Publish Date - 2022-02-02T15:42:33+05:30

ఇంధన వినియోగపరంగా రెండు రకాల వాహనాలు ఉన్నాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంధన వినియోగపరంగా రెండు రకాల వాహనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. వీటిలో డీజిల్‌తో నడిచే వాహనాలు, పెట్రోల్‌తో నడిచే వాహనాలు ఉంటాయి. అయితే కారులో డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్లినప్పుడు.. పొరపాటున కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుందో తెలుసా? ఇది చాలా చిన్నతప్పులా కనిపించినప్పటికీ, అది మీ కారుకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇటువంటి పొరపాట్లు  అప్పుడప్పుడు పెట్రోల్ బంక్ వద్ద కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా పొరపాటును మీ కారు విషయంలో ఇలా జరిగితే తేలికగా తీసుకోకండి. మీ వాహనంలో డీజిల్‌కి బదులు పెట్రోల్.. పెట్రోల్‌కి బదులు డీజిల్ పడితే అది వాహనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. అలా జరిగితే వెంటనే ఏం చేయాలో తెలుసుకుందాం. కారులో ఇంధన ప్రభావం గురించి తెలుసుకునేముందు పెట్రోల్, డీజిల్ వాహనాల మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. ఆటోమొబైల్స్‌ సంస్థలు అందించిన వివరాల ప్రకారం పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ భిన్నంగా ఉంటుందని, డీజిల్ ఇంజిన్‌లో అలాంటి స్పార్క్ ఉండదని తెలుస్తోంది. 


అలాగే పెట్రోల్ ఇంజిన్ కారులో కార్బ్యురేటర్ ఉంటుంది. అయితే అది డీజిల్ ఇంజిన్‌లో ఉండదు. పెట్రోల్ ఇంజన్లు గాలికి భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ కారులోని డీజిల్.. లూబ్రికేషన్ ఆయిల్‌గా కూడా పనిచేస్తుంది. ఫలితంగా ఇంజిన్ భాగాలు సాఫీగా నడుస్తాయి. అదే సమయంలో దానిలో పెట్రోల్ పోసినప్పుడు అది డీజిల్‌తో కలిసిపోయి ఒక ద్రావణిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది వాహనంలోని ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. డీజిల్ ఇంజిన్ కారులో పెట్రోల్‌ పోయడం వల్ల కారులోని యంత్ర భాగాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఫలితంగా ఇంజిన్‌పై దుష్ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో అంటే మీ కారులో పెట్రోల్ పోసిన తర్వాత కూడా ఇంజిన్‌ను రన్నింగ్‌లో ఉంచినా లేదా వాహనాన్ని డ్రైవ్ చేసినా.. ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం లేదా ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్‌ను పోసినప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ పోసినప్పుడు ఇంజిన్ భిన్నంగా పనిచేస్తుంది.  అయితే ఇది కారుపై అంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపదు. ఇది డీజిల్ ఇంజిన్ కంటే తక్కువగా స్పందిస్తుంది. అటువంటి స్థితిలో ఇంజిన్‌ను స్టార్ట్ చేయలేరు. మీ విషయంలో ఎప్పుడైనా ఇలా జరిగితే.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేయకండి. వాహనాన్ని ఒక పక్కన నిలిపివేసి.. మెకానిక్ సహాయంతో ఇంధన ట్యాంక్ మార్చండి. మిశ్రమ ఇంధనాన్ని తొలగించండి. ఆ తరువాత తిరిగి పెట్రోల్ లేదా డీజిల్.. మీ కారుకు ఏది సూటవుతుందో దానిని నింపిన తర్వాతే కారును స్టార్ట్ చేయండి. 



Updated Date - 2022-02-02T15:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising