ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: వైవాహిక జీవితంలో వీటికి చోటివ్వద్దు.. లేదంటే దంపతుల మధ్య దూరం ఖాయం!

ABN, First Publish Date - 2022-02-06T12:52:00+05:30

ఆచార్య చాణక్యుడు గ్రేట్ లైఫ్ కోచ్‌గా పేరుగాంచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుడు గ్రేట్ లైఫ్ కోచ్‌గా పేరుగాంచాడు. కౌటిల్యుడు అని కూడా పేరొందిన ఆచార్య చాణక్యుడు తన జీవిత విధానాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్త అయిన చాణక్యుని వ్యూహాలతో నంద వంశం నాశనమై, చంద్రగుప్త మౌర్య మగధ చక్రవర్తి అయ్యాడని చెబుతారు. చాణక్యునికి రాజకీయాలపైనే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన అవగాహన ఉంది. ఆచార్య చాణక్య.. మనిషి జీవితాన్ని ఎలా గడపాలో సూచించారు. దానిలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్య రచించిన నీతి శాస్త్రంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాల ప్రస్తావన ఉంది. 


ఇవి నేటి కాలానికి కూడా వర్తిస్తాయి. చాణక్యుడు తెలిపిన వైవాహిక జీవిత వివరాలు తెలుసుకుందాం. మోసం చేయడం విషం లాంటిదని చాణక్యుడు తన నీతిలో పేర్కొన్నాడు. భార్యాభర్తల బంధంలోనే కాదు.. ఏ సంబంధంలోనైనా మోసానికి తావుండకూడు. భార్యాభర్తలు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలంటే, జీవితంలో ఎప్పుడూ అబద్ధాలకు తావివ్వకూడదు. ఇది పరస్పరం మోసం చేసుకోవడమేనని ఆచార్య తెలిపారు. భార్యాభర్తల మధ్య సంబంధంలో అబద్ధాలకు ఆస్కారం ఉండకూడదని ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో తెలిపారు. అబద్దాలకు సంబంధించిన విషయాలు బార్యాభర్తల బంధాన్ని బీటలు వారేలా చేస్తుంది.  వారి మధ్య అనుబంధం బలహీనపడుతుంది. అందుకే దంపతులు పరస్పరం అబద్ధాలకు దూరంగా ఉండటం మంచిది. భార్యాభర్తలు ఒకరికొకరు స్నేహ పూర్వకంగా మెలగాలి. భార్యాభర్తలు తరచూ తామంటే తాము ఉన్నతులమని భావిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం వైవాహిక జీవితంలో ఇటువంటి ప్రవర్తన అస్సలు ఉండకూడదు. భార్యాభర్తలు నిరంతరం ఒకరికొకరు సమానులుగా భావించాలి. ఇటువంటి ప్రవర్తన ద్వారా వారి సంబంధంలో మాధుర్యం కొనసాగుతుంది. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. కోపం ఎటువంటి సంబంధాన్నయినా బలహీనపరుస్తుంది. వైవాహిక జీవితంలో భర్త లేదా భార్య ఎల్లప్పుడూ తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపం తెచ్చుకునే బదులు.. అన్ని పరిస్థితులలోనూ సానుకూలంగా ఆలోచించడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడం అవసరం. 

Updated Date - 2022-02-06T12:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising