ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూర బాగోలేదని గొడవకు దిగిన భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో ముగ్గరు హతం.. అసలు ఎలా జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-03-10T05:46:22+05:30

అతను మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. భార్య అతనికి భోజనం పెట్టింది. అయితే కూర రుచి బాగోలేదని అతను తన భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఆ మహిళ గొడవను మరింత పెద్దది చేస్తూ తన సోదరులను ఇంటికి పిలిపించింది...

మృతులు సీమ, ఆమె సోదరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. భార్య అతనికి భోజనం పెట్టింది. అయితే కూర రుచి బాగోలేదని అతను తన భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఆ మహిళ గొడవను మరింత పెద్దది చేస్తూ తన సోదరులను ఇంటికి పిలిపించింది. ఆ పంచాయితీ కొట్టుకునేవరకు వెళ్లింది.. చివరకు బెడ్రూమ్‌లో ఉన్న తుపాకీతో ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు.


ఢిల్లీలోని షకుర్‌పూర్ ప్రాంతంలో హితేంద్ర యాదవ్ అనే వ్యక్తి తన భార్య సీమ, ఇద్దరు పిల్లలు జై, విజయ్‌తో కలిసి నివస్తున్నాడు. వివాహం జరిగిన నాటి నుంచి సీమకు, హితేంద్రకు పడేది కాదు. ఇద్దరూ చిన్న చిన్న విషయాలకు తరచుగా ఘర్షణకు దిగుతుండేవారు. పెద్దలు సముదాయించి రాజీ కుదురుస్తూ ఉండేవారు. తాజాగా ఒకరోజు భార్య చేసిన పప్పు బాగోలేదని హితేంద్ర గొడవ చేశాడు. ఇలాంటి గొడవల్లో సీమ తరుచుగా ఆమె పుట్టింటి వారిని, బంధువులందరినీ పిలిచేది. ఆ రోజు కూడా అలాగే తన ఇద్దరు తమ్ముళ్లు, ఒక తమ్ముడి భార్యను తన తరపున వాదించడానికి పిలిచింది.హితేంద్ర కూడా తనకు మద్దతుగా తన మిత్రుడొకడిని పిలిచాడు.


సీమ తమ్ముళ్లిద్దరూ అక్కడికి చేరుకొని.. హితేంద్రతో గొడవకు దిగారు... అదే సమయంలో హితేంద్ర మిత్రుడు కూడా వాదనకు దిగాడు. కానీ అతడు కుటుంబ వ్యక్తి కాదని అందువల్ల బయటికి వెళ్లిమ్మని వారు చెప్పారు. ఇది విని హితేంద్రకు మద్దతుగా అతని పెద్ద కుమారుడు జై వచ్చాడు. ఇది చూసి సీమ, ఆమె ఇద్దరు తమ్ముళ్లు అతడిని కొట్టారు. జైని అతని ఇద్దరు మేనమామలు కొట్టడం చూసి హితేంద్ర వారిని అడ్డుకోబోయాడు. కానీ వారు హితేంద్రను పక్కకు తోసేశారు. దీంతో కోపం పట్టలేని హితేంద్ర తన బెడ్రూంలోని రివాల్వర్ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు.


ఆ కాల్పుల్లో సీమ, ఆమె ఇద్దరు తమ్ముళ్లు అక్కడికక్కడే మరణించారు. సీమ తమ్ముడి భార్య కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. ఇంత జరిగాక హితేంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 


Updated Date - 2022-03-10T05:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising