ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలస్యంగా ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదని.. చివరికి ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-02-07T01:49:22+05:30

అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పని మీద బయటికి వెళ్లిన భర్త.. ఆలస్యంగా ఇంటికొచ్చాడు. బెడ్‌రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదు. దీంతో అనుమానంతో తలుపులను మరింత గట్టిగా బాదాడు...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు దంపతులు చిన్న చిన్న కారణాలు చూపిస్తూ గొడవ పడుతూ ఉంటారు. చివరకు ఆ గొడవలను పంచాయితీల వరకూ తీసుకెళ్తుంటారు. మరికొందరైతే దాడి చేయడమో, ప్రాణాలు తీయడమో చేస్తుంటారు. అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పని మీద బయటికి వెళ్లిన భర్త.. ఆలస్యంగా ఇంటికొచ్చాడు. బెడ్‌రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదు. దీంతో అనుమానంతో తలుపులను మరింత గట్టిగా బాదాడు. అనంతరం అతడు చేసిన పని ఎంత వరకు వెళ్లిందంటే..


గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలోని షాపూర్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ దంపతులకు 2019లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్త పని నిమిత్తం నిత్యం బయటికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటాడు. బుధవారం కూడా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. బెడ్‌రూం తలుపు కొట్టగా భార్య ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం, కోపంతో మరింత గట్టిగా తలుపులను బాదడం మొదలెట్టాడు. కాసేపటికి తలుపు తెరచిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోయాడు.

దుష్ట నివారణ పూజల పేరుతో యువతిని ఇంట్లో బంధించిన పోలీసు.. ఏకంగా 40 రోజుల పాటు..


‘‘ఇంతసేపు తలుపు తీయకుండా ఏం చేస్తున్నావ్’’.. అంటూ దుర్భాషలాడాడు. పడుకుని ఉండడంతో తలుపు తీయడం ఆలస్యమైందని భార్య చెబుతున్నా.. అతడు మాత్రం వినిపించుకోలేదు. మరింత కోపంతో భార్యను బలంగా నేలకేసి కొట్టాడు. గొంతు పట్టుకుని చంపడానికి కూడా ప్రయత్నించాడు. తర్వాత కొడుకుతో సహా భార్యను ఇంటి నుంచి బయటికి గెంటేయడంతో పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. వరకట్నం కోసం వివిధ సాకులు చూపి నిత్యం దాడి చేస్తుంటాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాయ్స్ హాస్టల్లోకి ప్రియురాలిని తీసుకెళ్లాలి... అందుకోసం అతడు వేసిన మాస్టర్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..

Updated Date - 2022-02-07T01:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising