ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Alappuzha Collector: ‘ఏవండోయ్ శ్రీవారు.. ఇల్లు జాగ్రత్త’ అని చెప్పినంత సింపుల్‌గా ఈవిడ..

ABN, First Publish Date - 2022-07-28T22:14:57+05:30

ఆ భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్‌లే (IAS). వ్యక్తిగత జీవితంలో ఆలుమగలైన వారిద్దరికీ వృత్తిపరంగా ఒక అరుదైన పరిణామం ఎదురైంది. భార్య కలెక్టర్‌గా పనిచేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలప్పుజ: ఆ భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్‌లే (IAS). వ్యక్తిగత జీవితంలో ఆలుమగలైన వారిద్దరికీ వృత్తిపరంగా ఒక అరుదైన పరిణామం ఎదురైంది. భార్య కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాకు భర్త కలెక్టర్‌గా వెళ్లారు. ఆయన భార్య మరో జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ ఘటన కేరళలో (Kerala) చోటుచేసుకుంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అలప్పుజ కలెక్టర్‌గా పనిచేసిన రేణూ రాజ్ (Renu Raj) అనే మహిళా ఐఏఎస్ అధికారి తన జిల్లా బాధ్యతలను ఆమె భర్త శ్రీరామ్ వెంకట్రామన్‌కు (Sriram Venkitraman) అప్పగించారు. ఇన్నాళ్లూ తాను కూర్చున్న జిల్లా కలెక్టర్ సీటులో కూర్చునేందుకు రేణూ రాజ్ తన భర్తను ఆహ్వానించారు.



ఆయన అలప్పుజ కలెక్టర్ (Alappuzha Collector) స్థానంలో కూర్చోగానే శుభాకాంక్షలు తెలుపుతూ కరచాలనం చేశారు. తాను కలెక్టర్‌గా పనిచేసిన జిల్లాను సుభిక్షంగా చూసుకోవాలని భర్తను కోరుతూనే, అలప్పుజ జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా శ్రీరామ్ వెంకట్రామన్ (Sriram Venkitraman) పోస్టింగ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వెలుపల నిరసనకు దిగారు. వెంకట్రామన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ అయి, సస్పెండ్ అయిన వ్యక్తికి తమ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఎలా ఇస్తారంటూ నిరసనకు దిగిన వారు నిలదీశారు.



2019లో వెంకట్రామన్ తన స్నేహితురాలు వాఫా ఫిరోజ్‌తో (కారు ఈవిడే డ్రైవింగ్ చేసింది) కలిసి కారులో హై స్పీడ్‌లో వెళుతుండగా కారు అదుపు తప్పి టూ-వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో అరెస్ట్ అయి, సస్పెండ్ అయిన వెంకట్రామన్ 2020లో మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆయన అలప్పుజ జిల్లాకు కలెక్టర్‌గా ఎలా వస్తారంటూ ఆ జిల్లా కేరళ కాంగ్రెస్ నిలదీసింది. అతని పోస్టింగ్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మేజిస్ట్రేట్‌తో సమాన హోదా కలిగిన వ్యక్తి అని.. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ప్రజలకు న్యాయం ఎలా చేస్తారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళ కేడర్‌కు చెందిన ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు డాక్టర్లు కూడా కావడం గమనార్హం. ఈ ఏప్రిల్‌లోనే వీరిద్దరికీ వివాహమైంది.

Updated Date - 2022-07-28T22:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising