ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను చచ్చిపోతున్నా.. అంటూ వీడియో కాల్ చేసిన భర్త.. సరేనంటూ తలూపిన భార్య.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-25T22:45:56+05:30

అతను తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను భరించలేకపోయాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను భరించలేకపోయాడు.. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.. చనిపోయే ముందు భార్యకు వీడియో కాల్ చేశాడు.. తాను చనిపోతున్నానని చెప్పాడు.. సరేనని భార్య తలూపింది.. ఆ తర్వాత అతను ఉరేసుకుని చనిపోయాడు.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది.. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కోలార్ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగిన ప్రాపర్టీ డీలర్ వినయ్ రజక్ ఆత్మహత్యకు సంబంధించిన సంచలన వీడియో తాజాగా బయటపడింది. ఆత్మహత్య చేసుకునే ముందు వినయ్ తన భార్య ఆర్తికి వీడియో కాల్ చేశాడు. `నేను చనిపోతున్నాను. నా చావుకు నువ్వు, నీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే బాధ్యులు. నన్ను మీరు శారీరకంగా, మానసికంగా వేధించారు. నేను బాగా బతకాలనుకున్నాను. కానీ, మీ వల్ల కుదరలేదు. మీరు తప్ప నా చావుకు వేరెవరూ కారణం కాద`ని ఆ వీడియోలో రజక్ పేర్కొన్నాడు. 


నేను చనిపోతున్నానని భర్త చెప్పగానే.. ఆర్తి తల ఊపి ఓకే చెప్పింది. దీంతో వినయ్ తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఆ వీడియో కాల్‌ను తన కుటుంబ సభ్యులందరికీ పంపించాడు. వినయ్ అంత్యక్రియలకు కూడా ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. ఈ వీడియో ఆధారంగా వినయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్తితో పాటు ఆమె ముగ్గురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.  

Updated Date - 2022-04-25T22:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising