ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: పెళ్లైన మరుసటి రోజే భార్యపై భర్త పోలీస్ కంప్లైంట్.. ఫిర్యాదు ఏంటంటే..!

ABN, First Publish Date - 2022-12-31T10:19:18+05:30

వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ విషయాన్నే ఇంట్లో చెప్పి పెళ్లి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ పెళ్లైన రోజు రాత్రే వధువుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ విషయాన్నే ఇంట్లో చెప్పి పెళ్లి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ పెళ్లైన రోజు రాత్రే వధువుకు సంబంధించిన షాకింగ్ నిజం ఆ వరుడికి తెలిసింది. దీంతో మరుసటి రోజు ఉదయమే అతడు పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన హర్యానా(Haryana)లోని దర్గాపూర్‌లో చోటు చేసుకుంది. సుఖాలాల్ అనే 30ఏళ్ల యువకుడికి సోషల్ మీడియా(Social Media)లో ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాత స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఆ యువతి, యువకులు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్ల అనుమతితోనే తాజాగా స్థానికంగా ఉన్న రాధాకృష్ణ ఆలయంలో వివాహం(Love Marriage) చేసుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వధూవరులకు శోభనాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. తొలిరాత్రి వధువుకు సంబంధించిన షాకింగ్ నిజం అతడికి తెలిసింది. ఇంత కాలం తను ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి విస్తుపోయాడు.

ఇది కూడా చదవండి: 2023 Big Changes: క్రెడిట్ కార్డు నుంచి ఇన్సూరెన్స్ వరకు.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!

మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌(Police Complaint)కు చేరుకున్నాడు. తను మోసపోయానంటూ జరిగిన విషయాన్ని చెప్పి వాపోయాడు. విడాకులు కోరితే.. తన భార్య భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-12-31T10:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising