ప్రియురాలితో షాపింగ్ చేస్తున్న భర్త... హఠాత్తుగా ఊడిపడిన భార్య... తరువాత ఏం జరిగిందంటే...
ABN, First Publish Date - 2022-10-17T15:40:14+05:30
వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఏకంచేస్తుంది. అయితే వారి...
వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఏకంచేస్తుంది. అయితే వారి మధ్య పరస్పర అవగాహన, నమ్మకం లేకపోతే క్రమంగా దూరం పెరుగుతుంది. అటువంటప్పుడు జీవిత భాగస్వామి బయట మరొకరితో సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇటువంటి వైనానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉదంతం యూపీలోని ఘజియాబాద్‌లో చోటు చేసుకున్నదని తెలుస్తోంది. ఒక మహిళ తన భర్తను అతని ప్రియురాలితో పాటు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఆ తర్వాత ఆమె భర్త, అతని ప్రియురాలిపై దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యువకుడు తన భార్యతో కాకుండా ప్రియురాలితో కర్వా చౌత్ షాపింగ్ కోసం మార్కెట్‌కు వచ్చాడు. అదే సమయంలో అతని భార్య తన తల్లితోపాటు కర్వా చౌత్ షాపింగ్ కోసం అక్కడికే వచ్చింది. బజారులో తన భర్త మరో అమ్మాయితో కలిసి ఉండడం చూసి భార్య ఆగ్రహంతో ఊగిపోతూ, భర్తను, అతని ప్రియురాలిని చితకబాదింది. వివరాల్లోకి వెళితే ఈ జంటకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేవు. విషయం కోర్టుకు కూడా చేరింది. భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.
Updated Date - 2022-10-17T15:40:14+05:30 IST