ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో హోలీ వేడుకలు జరగనున్నాయిలా..

ABN, First Publish Date - 2022-03-12T15:00:16+05:30

మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడ జరిగే పండుగలు.. సాంస్కృతిక సంపదను మరింత గొప్పగా మారుస్తాయి. ఈ నెల 18న హోలీ పండుగ జరుగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీ ఉత్సవాన్ని చాలా రోజుల పాటు జరుపుకుంటారు. కృష్ణ భగవానుని నగరమైన మధురలో ఈ రంగుల పండుగ 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంతకాలం ప్రారంభంతోనే ఈ వేడుకలు  ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హోలీ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. దేవాలయాలలో హోలీ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం యూపీలోని అన్నిచోట్లా హోలీ ఉత్సాహం కనిపించింది. బర్సానాలోని లాడ్లీజీ ఆలయంలో లడ్డూ హోలీ ఆటతో హోలీ ఆనందం తారాస్థాయికి చేరుకుంటుంది. శ్రీజీ మందిర్‌కు చెందిన సేవాయత్ కిషోరి గోస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈసారి హోలీ వేడుకలు నవమి, దశమి రోజుల్లో కూడా జరగనున్నాయన్నారు. మార్చి 12 ఏకాదశి నాడు మధురలోని ఠాకూర్ ద్వారకాధీష్, బృందావన్‌లోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయంలో భక్తులు తమ విగ్రహాలతో హోలీ ఆడతారని ఆయన తెలిపారు. 


శ్రీకృష్ణునిపై భక్తులు లడ్డూల వర్షం కురిపిస్తారని సేవాయత్ గోస్వామి చెప్పారు. ఈ లడ్డూలను తరువాత ప్రసాదంగా ఇస్తారని, దీనిని 'లడ్డూ హోలీ' లేదా 'లడ్డూ లీలా' అంటారన్నారు. ఫాల్గుణ శుక్ల నవమి రోజున బర్సానాలో లత్మార్ హోలీ చేసుకుంటారు. హోలీ వేడకల కోసం ఢిల్లీ నుంచి 10 క్వింటాళ్ల పూలు ఆర్డర్ చేశామన్నారు. మార్చి 14 న భక్తులు మధురలోని ఠాకూర్ ద్వారకాధీష్, బృందావన్‌లోని ఠాకూర్ బాంకే బిహారీ ఆలయంలో రంగులతో హోలీ ఆడతారు. గోకుల్ ఛదిమార్ హోలీ మార్చి 16న జరగనుంది. బాలకృష్ణతో హోలీ ఆడేందుకు గోపికలు కోలాటాలు తీసుకుని బయటకు వస్తారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలికా దహనం సందర్భంగా కోసికలన్ సమీపంలోని ఫలైన్ గ్రామంలో హోలీ మంటలు వేయనున్నారు. మరుసటి రోజు బ్రజ్వాసీలు హోలీ ఆడనున్నారు. 


Updated Date - 2022-03-12T15:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising