ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందా? గణాంకాలు చెబుతున్నదిదే!

ABN, First Publish Date - 2022-08-10T16:35:22+05:30

2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ఇందులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ఇందులో ముస్లింల జనాభా 17.22 కోట్లు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికొస్తే జమ్మూ కాశ్మీర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వీటిలో ముందువరుసలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ జనాభాలో 68.31 శాతం వరకు ముస్లింలు ఉన్నారు. 34.22 శాతంతో అస్సాం రెండో స్థానంలో ఉంది. గత 5 దశాబ్దాలను పోల్చి చూస్తే 2001-2011 మధ్య గరిష్టంగా ముస్లిం జనాభా పెరిగింది. ఈ సమయంలో ముస్లిం జనాభా 17 కోట్లు దాటింది. 1961-71తో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 


1992-93లో నిర్వహించిన మొదటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం నాడు ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉంది. ఈ లెక్కన చూస్తే ఒక ముస్లిం మహిళ తన జీవితకాలంలో నలుగురికి మించి పిల్లలకు జన్మనిస్తున్నది. సుమారు 3 దశాబ్దాల తర్వాత నాటి గణాంకాలను పరిశీలిస్తే, హిందూ మహిళల సంతానోత్పత్తి రేటు 1.9 కాగా ముస్లిం మహిళల్లో ఈ సంఖ్య 2.3గా ఉంది. అంటే హిందూ మహిళల కంటే ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. భారతదేశంలోని హిందువులు, ముస్లింల మధ్య సంతానోత్పత్తి రేటుపై అమెరికన్ థింక్‌ట్యాంక్ ప్రూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ ప్రకారం రాబోయే రెండు దశాబ్దాలలో, హిందువులు, ముస్లింల మధ్య సంతానోత్పత్తి రేటులో అంతగా తేడా ఉండదు. విదేశాలకు వెళ్లే వారి కంటే పొరుగు దేశాల నుంచి భారత్‌కు వలస వస్తున్న ముస్లింలే ఎక్కువని మీడియా నివేదిక పేర్కొంది. 

Updated Date - 2022-08-10T16:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising