ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమలు చీకటిలో మనుషులను ఎలా గుర్తుపడతాయో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-02-14T15:08:23+05:30

దోమల పేరు వినగానే వాటి కాట్లు గుర్తుకువస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమల పేరు వినగానే వాటి కాట్లు గుర్తుకువస్తాయి. వాటి కాటు కారణంగా శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. దోమల బెడద కారణంగా నిద్ర పట్టదు. రాత్రి వేళ ఎంతటి చీకటిలో ఉన్నా దోమలు మనల్ని గుర్తించి కాటువేసి, రక్తాన్ని పీల్చుకుంటాయి. అయితే దోమలు చీకటిలో కూడా మనుషులను ఎలా గుర్తిస్తాయి? ఈ మిస్టరీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆడ దోమలు వాటి గుడ్లను అభివృద్ధి చేయడానికి, వాటిని పెంచడానికి మన రక్తాన్ని పీలుస్తాయి. ఎందుకంటే వాటి గుడ్లను అభివృద్ధి చేయడానికి ప్రోటీన్లు, విటమిన్లు అవసరం. అందుకే  అవి మన రక్తాన్ని పీలుస్తాయి.


అయితే చీకట్లో దోమలు మనల్ని కనిపెట్టడానికి కారణం మనం శ్వాస తీసుకోవడం.  మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు, కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదల అవుతుంది. దీని వాసన కారణంగా దోమలు మనిషి శరీరాన్ని గుర్తిస్తాయి. ఆడ దోమ తన 'సెన్సింగ్ ఆర్గాన్స్' ద్వారా 30 అడుగులకు మించిన దూరం నుంచే కార్బన్ డయాక్సైడ్ వాసనను సులభంగా గుర్తించగలదు. ఈ విధంగా దోమలు చీకట్లో కూడా మనుషుల దగ్గరకు చేరి.. మన శరీరం నుండి రక్తాన్ని పీలుస్తుంటాయి. ఇదేవిధంగా మనిషి శరీరపు ఉష్ణోగ్రత, వాసనల కారణంగానూ దోమలు మనిషి చెంతకు చేరుతాయి. కాగా దోమల కారణంగా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, మెదడువాపు, జికా వైరస్, చికున్‌గున్యా తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి. దోమలు 'ఓ' బ్లడ్ గ్రూప్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాయని వివిధ పరిశోధనల్లో తేలింది. 

Updated Date - 2022-02-14T15:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising