ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల రసం నుంచి తేనెను తయారు చేసేందుకు తేనెటీగలు ఎంత కష్టపడతాయో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-01-19T15:54:07+05:30

తేనె అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో,,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తేనె అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలుసు. అయితే తేనెటీగలు ఈ తేనెను ఎలా తయారు చేస్తాయో మీకు తెలుసా? తేనెటీగలు తేనెను తయారు చేయడానికి నాణ్యమైన పూలను ఎంచుకుంటాయి. ఆ పూల రసం నుంచి తేనెను తయారు చేస్తాయి. అయితే ఈ ప్రక్రియ అంత సులభంగా జరగదు. ఒక తేనెపట్టులో దాదాపు 60 వేల తేనెటీగలు ఉంటాయి. అవన్నీ పూల నుండి రసాన్ని సేకరిస్తాయి. ఆ రసం నుంచి తేనె ఎలా తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెటీగలు తేనెను తయారు చేయడానికి ఒక జట్టుగా పనిచేస్తాయి. కార్మిక తేనెటీగల సమూహం మెరుగైన, నాణ్యమైన పూల నుంచి తేనెను సేకరిస్తుంది. 


ఇందుకోసం అవి తేనెపట్టు నుండి 5 కిలోమీటర్ల వ్యాసార్థంలోగల వివిధ ప్రాంతాలలో తిరుగుతాయి. ఏదైనా తేనెటీగకు మంచి పూల రసం గల తోటలు కనిపిస్తే, ఆ విషయాన్ని అది ఇతర తేనెటీగలకు తెలియజేస్తుంది. ఆ తేనెటీగ ఒక ప్రత్యేకమైన కదలిక ద్వారా మిగిలిన తేనెటీగలకు ఈ సమాచారాన్ని అందిస్తుంది. దీంతో ఆ తేనెటీగలన్నీ పూల రసాన్ని పీల్చి కడుపు నింపుకుంటాయి. వాటి కడుపులో గల ఒక ప్రత్యేక ఎంజైమ్ కారణంగా పూల రసం హానికారకం కాని చక్కెరగా మారుతుంది. ఆ తేనెటీగలన్నీతమ తేనెపట్టు దగ్గరకు వచ్చి, అందులో ఉంటున్న కొన్ని తేనెటీగలకు తాము పీల్చిన రసాన్ని వాటి నోటికి అందిస్తాయి. అప్పుడు ఆ తేనెటీగలు పట్టులోని వివిధ అరలలో ఆ తేనెను నింపుతాయి. ఆ తరువాత అవి తమ రెక్కలను ఆడిస్తూ, పూలరసంలోని తేమను పొగొట్టే ప్రయత్నం చేస్తాయి. ఫలితంగా ఆ రసం గట్టిపడి తేనెగా మారుతుంది. దీనిని గమనించిన తేనెటీగలు ఆ అరలను మైనంతో మూసివేస్తాయి. తేనెటీగలు తేనెను తయారు చేయడం వెనుక ఇంత ప్రక్రియ జరుగుతుంది. అయితే శీతాకాలంలో పూలు తక్కువగా ఉండటం వలన తేనె టీగలు ఆ పూల రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి.

Updated Date - 2022-01-19T15:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising