ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూజర్‌కు బ్రైట్‌నెస్ ఎప్పుడు కావాలో.. ఎప్పుడు అక్కర్లేదో స్మార్ట్‌ఫోన్ ఎలా గుర్తిస్తుందంటే..

ABN, First Publish Date - 2022-02-28T13:56:59+05:30

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో ఆటో బ్రైట్‌నెస్ అనే ఫీచర్ ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో ఆటో బ్రైట్‌నెస్ అనే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ వినియోగదారుల మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడు పెంచాలి?ఎప్పుడు తగ్గించాలో నిర్ణయిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iOS ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లే కాకుండా ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్స్‌లలో కూడా దీని వినియోగం ఉంటుంది. మరి ఈ ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు లేదా వెలుతురు ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్‌లో మార్పులు చోటుచేసుకోవడం మీకు గమనించే ఉంటారు. ఈ విధంగా ప్రకాశాన్ని ఎప్పుడు పెంచాలో? ఎప్పుడు తగ్గించాలో స్మార్ట్‌ఫోన్‌కు ఎలా తెలుస్తుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. 


గాడ్జెట్స్‌నో తెలిపిన వివరాల నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, బేరోమీటర్ తదితర సెన్సార్‌లు ఇన్‌స్టాల్ అయివుంటాయి. వీటిలో ఒకటే యాంబియంట్ లైట్ సెన్సార్. ఈ సెన్సార్ సహాయంతో ఈ ఫీచర్ పని చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన యాంబియంట్ లైట్ సెన్సార్.. మొబైల్ చుట్టూ ఎప్పుడు వెలుతురు ఉందో, ఎప్పుడు లేదో గుర్తిస్తుంది. ఇది కెమెరా మాదిరిగా పనిచేస్తుంది. ఇది మొబైల్ చుట్టూ ఉన్న కాంతిని గుర్తిస్తుంది. తదనుగుణంగా ప్రకాశాన్ని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఫీచర్ పిక్సెల్ కొన్ని సామ్‌సంగ్ ఫోన్‌లలో కూడా ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వెలుతురును సర్దుబాటు చేస్తుంది. అలాగే ఆపిల్‌లోని ట్యూన్ టోన్ ఫీచర్ కూడా ఇందుకు సహాయపడుతుంది. 

Updated Date - 2022-02-28T13:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising