ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పని నుంచి తప్పించుకునేందుకు నిద్రపోతున్నట్టు నటించిన గుర్రం.. ‘స్పిరిట్ యానిమల్’ అంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-06-14T23:14:32+05:30

పని చేయడం కొందరికి ఇష్టమైన పని అయితే, మరికొందరికి కష్టమైన పని. దానిని ఎలా తప్పించుకోవాలా? అని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పని చేయడం కొందరికి ఇష్టమైన పని అయితే, మరికొందరికి కష్టమైన పని. దానిని ఎలా తప్పించుకోవాలా? అని పరిపరి విధాలా ఆలోచిస్తుంటారు. అందుకోసం కొన్ని ఎత్తులు కూడా వేస్తుంటారు. ఇలాంటి వారిని ముద్దుగా ‘పనిదొంగ’ అని పిలుస్తుంటారు. మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా పని నుంచి తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తుంటాయని ‘షుగర్’ అనే గుర్రం తాజాగా నిరూపించింది. పని నుంచి తప్పించుకునేందుకు అది ఆడిన నాటకానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


జిమ్ రోజ్ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో నిద్రపోతున్న అశ్వం (షుగర్) ఫొటోను షేర్ చేశాడు. ‘‘దీని పేరు షుగర్. ఇది రైడింగ్‌కు ఇష్టపడడం లేదు. రైడింగ్ కోసం జీనుతో దాని దగ్గరకు వస్తే అది నిద్రపోతున్నట్టు నటిస్తోంది. రైడర్లు వెళ్లిపోయే వరకు కళ్లు తెరిచేందుకు అది నిరాకరిస్తోంది’’ అని ఆ ఫొటోకు ఆయన క్యాప్షన్ తగిలించారు. ఈ పోస్టు వైరల్ అయ్యాక ‘షుగర్’ ఫేమస్ అయిపోయింది. ఈ పోస్టుకు ఏకంగా 476,000కుపైగా లైకులు వచ్చాయి. 41,000 సార్లు రీట్వీట్ అయింది. ‘స్పిరిట్ యానిమల్’ (పవిత్రమైన జంతువు)గా నెటిజన్లు దీనిని అభివర్ణిస్తున్నారు.  

Updated Date - 2022-06-14T23:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising