ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివారమే ఎందుకు సెలవు? మిగిలిన రోజుల్లో సెలవు ఎందుకు ఉండదు?.. దీనివెనుక కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2022-01-22T16:00:51+05:30

అందరూ అత్యంత ఆతృతగా వేచి చూసే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందరూ అత్యంత ఆతృతగా వేచి చూసే రోజు ఆదివారం... సన్ డే అనగానే అందరిలో ఎక్కడాలేని ఉత్పాహం వచ్చేస్తుంది. వారంలో ఏడురోజులున్నా ఆదివారం ఎందుకు సెలవు ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీని వెనుక చాలా కథనాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ (ఐఎస్ఓ) తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం వారంలో చివరి రోజు. ఆ రోజు సాధారణ సెలవుదినం. దీనిని 1986వ సంవత్సరంలో గుర్తించారు.


అయితే దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఆదివారాన్ని వారంలో చివరి రోజుగా పరిగణిస్తున్నందున పాఠశాలలు, కళాశాలలకు కూడా ఆదివారం సెలవు ప్రకటించారు. ఆదివారం సెలవురోజుగా పరిగణించడం వెనుక అనేక మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. రోమన్ కాథలిక్, ప్రొటెస్టంట్ క్రైస్తవులు ఆదివారాన్ని దేవుని దినంగా పరిగణిస్తారు. ఐరోపాతో సహా చాలా దేశాల్లో క్రైస్తవులు చర్చికి వెళతారు. దేవుడు వారంలోని ఆరు రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించాడని, ఆదివారం విశ్రాంతి తీసుకున్నాడని క్రైస్తవులు నమ్ముతారు. అందుకే ఆదివారాన్ని విశ్రాంతి దినంగా వారు ఎంచుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు పాలించే కాలంలో భారతీయులు ఏడు రోజులూ పని చేసేవారు. ఒక్క రోజు కూడా విశ్రాంతి ఉండేదికాదు. 1857లో కార్మిక నేత మేఘాజీ లోఖండే సెలవుదినం గురించి ఉద్యమం ప్రారంభించారు. బ్రిటిష్ వారితో సెలవు కోసం పోరాడాడు. కార్మికులకు ఒక రోజు సెలవు కావాలని కోరాడు. బ్రిటీష్ ప్రజలు సెలవురోజైన ఆదివారం చర్చికి వెళ్లేవారు. ఈ నేపధ్యంలోనే భారతదేశంలో కూడా ఆదివారం సెలవుదినంగా మారింది. తదనంతర కాలంలో భారత ప్రభుత్వం ఆదివారాన్ని వారాంతపు సెలవు దినంగా గుర్తించింది. అయితే ఆర్టీఐలో.. ఆదివారం ప్రభుత్వ సెలవు దినంగా చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది.


Updated Date - 2022-01-22T16:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising