ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కూతురిని ఎత్తుకుని ‘సీఎం.. సార్..’ అంటూ బహిరంగ సభలో ఓ తండ్రి అరుపులు.. ముఖ్యమంత్రి అతడిని చూసి వేదికపైకి పిలిచి..

ABN, First Publish Date - 2022-06-24T17:51:50+05:30

బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసిందేకు ఓ తండ్రి తీవ్రంగా ప్రయత్నించాడు. వందలాది మంది ప్రజల మధ్య నుంచి కూతురిని ఎత్తుకుని ‘సీఎం సార్..’ గట్టిగా అరిచాడు. ఎలాగోలా ఆ మాటలు సీఎం చెవిన పడ్డాయి. దీంతో వేదికపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసిందేకు ఓ తండ్రి తీవ్రంగా ప్రయత్నించాడు. వందలాది మంది ప్రజల మధ్య నుంచి కూతురిని ఎత్తుకుని ‘సీఎం సార్..’ గట్టిగా అరిచాడు. ఎలాగోలా ఆ మాటలు సీఎం చెవిన పడ్డాయి. దీంతో వేదికపైకి వెళ్లేందుకు ఆ తండ్రికి అనుమతి లభించింది. ఈ క్రమంలో కూతురుతో సహా ముఖ్యమంత్రిని కలిసి తన బాధను వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 


మధ్యప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. గురువారం ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభకు సుజీత్ పంకజ్ అనే వ్యక్తి.. తన కూతురితో సహా వెళ్లాడు. అనంతరం సీఎంను కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా కారణాల వల్ల సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో వందలాది మంది ప్రజల మధ్య నుంచే సీఎం దృష్టిలో పడేందుకు ప్రయత్నించాడు. ‘సీఎం సార్..’  అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఎలాగోలా అతడి మాటలు చౌహాన్ చెవిన పడ్డాయి. దీంతో వేదికపైకి వెళ్లేందుకు సుజీత్‌కు అనుమతి లభించింది. 



ఈ క్రమంలో కూతురితో సహా వేదిక వద్దకు వెళ్లిన అతడు.. తన బాధను సీఎం వద్ద వెల్లడించాడు. తన కూతురు.. కాలెయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది.. చికిత్స చేయించే స్తోమత తనకు లేదని.. ఎలాగైనా తనకు సాయం చేయాలని ముఖ్యమంత్రిని వేడుకున్నాడు. అతడి అభ్యర్థన పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు. వెంటనే అధికారులను పిలిచి.. ఆ చిన్నారికి చికిత్స అందించే ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు. పాప తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అనంతరం.. సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నాణ్యమైన చికిత్స అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌తో ప్రజలకు ఇబ్బందులను తీర్చిందన్నారు. పంకజ్ కూతురికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చికిత్స అందించనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా సీఎం సహాయ నిధి ద్వారా కూడా అతడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. 




Updated Date - 2022-06-24T17:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising