ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Touching Story: ఈ అక్క ప్రేమ బరువు 5 కేజీలు.. ప్రతీ అక్కాతమ్ముడు తప్పక చదవాల్సిన స్టోరీ..

ABN, First Publish Date - 2022-07-05T01:06:25+05:30

అక్కాతమ్ముడి అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులో అక్కాతమ్ముడి కొట్లాటలు, తమ్ముడిని ఏడిపించే అక్క, అక్కపై అమ్మానాన్నకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కాతమ్ముడి అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులో అక్కాతమ్ముడి కొట్లాటలు, తమ్ముడిని ఏడిపించే అక్క, అక్కపై అమ్మానాన్నకు చాడీలు చెప్ప తమ్ముడు.. ఇలా ఆ బంధంలో ఉండే మమతానురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అక్కాతమ్ముడే కేరళకు చెందిన కృష్ణప్రియ, కృష్ణప్రసాద్. ఈ అక్కాతమ్ములిద్దరూ చిన్న నాటి నుంచి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. అక్కను చూడందే ఆ తమ్ముడికి రోజు మొదలయ్యేది కాదు. తమ్ముడితో ఆడుకోనిదే ఆ అక్కకు పొద్దు గడిచేది కాదు. ఈరోజుల్లో బంధాల గురించి సహజంగా ఉండే అభిప్రాయం ఏంటంటే.. ఈ ప్రేమానురాగాలన్నీ బాల్యంలోనే. పెరిగి పెద్దయ్యాక ఎవరి జీవితాలు వారివే. ఆ బంధాల మధ్య అనురాగం సన్నగిల్లుతుందనే అబిప్రాయం సమాజంలో ఉంది.



కానీ.. ఈ అక్కాతమ్ముడు అలా కాదు. కృష్ణప్రియ, కృష్ణప్రసాద్ పెరిగి పెద్దయ్యాక కూడా ఆ బంధాన్ని మర్చిపోలేదు. పెళ్లయిన తర్వాత కూడా కృష్ణప్రియ ఉద్యోగ రీత్యా ఎక్కడున్నప్పటికీ ‘బ్రదర్స్ డే’ (May 24) వచ్చిందంటే కచ్చితంగా తన సోదరుడికి కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపేది. కానీ.. ఈ సంవత్సరం బిజీ షెడ్యూల్ కారణంగా తన సోదరుడికి శుభాకాంక్షలు చెప్పడం కృష్ణప్రియకు కుదరలేదు. అక్క నుంచి కాల్ కోసం ఎదురుచూసిన కృష్ణప్రసాద్ తీవ్ర నిరాశ చెందాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వలేదు. తనకు ‘బ్రదర్స్ డే’ విషెస్ చెప్పిన కొందరి సంభాషణలను అక్కకు స్క్రీన్‌షాట్ పంపాడు. గంటలు గడిచినప్పటికీ కారణం ఏంటో గానీ ఆమె చూసుకోలేదు. చివరికి అక్క మీద కోపంతో ఆమె నంబర్‌ను కూడా బ్లాక్ చేశాడు. తమ్ముడి కోపంతో ఎంతో బాధపడిన ఈ అక్క ఆ తమ్ముడి ప్రేమాభిమానాల కోసం పరితపించింది. ఎలాగైన తన తమ్ముడి మనసు మార్చాలనుకుంది.



ఒక అపురూపమైన కానుక పంపి తమ్ముడి కోపాన్ని ప్రేమగా మార్చాలనుకుంది. అందుకు కృష్ణప్రియ ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. 434 మీటర్ల పొడవున్న 15 రోల్స్ వైట్ పేపర్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 12 గంటలకు పైగా కష్టపడి ఆ పేజీలపై చిన్ననాటి నుంచి తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని, ఆ జ్ఞాపకాలను అక్షరాలుగా రాసింది. 5 కేజీల బరువున్న ఆ బండిల్‌ను తమ్ముడికి పార్శిల్ చేసింది. పార్శిల్ చేసిన రెండు రోజులకు కృష్ణప్రసాద్‌కు ఆ అక్క లేఖ చేరింది. పార్శిల్ చూసి ఎవరైనా పుట్టినరోజు కానుక పంపారేమోనని కృష్ణప్రసాద్ అనుకున్నాడు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ సుదీర్ఘ లేఖ చదివాక తనపై అక్కకు ఉన్న ప్రేమకు ఆ తమ్ముడి కళ్లు చెమ్మగిల్లాయి. కోపం కాస్తా కొవ్వొత్తిలా కరిగిపోయింది.



434 మీటర్ల పొడవున్న వైట్ పేపర్‌పై అంత కష్టపడి పెన్నులు వాడి చేతితో అన్ని గంటల పాటు లేఖ రాసిందని తెలిసి ఆ తమ్ముడు సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ సుదీర్ఘ లేఖ గిన్నిస్ బుక్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకోనున్నట్లు తెలిసింది. వాట్సాప్‌లో ఒక ఫొటోనో లేక నాలుగు అక్షరం ముక్కలో రాసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఈరోజుల్లో ఈ అక్క రాసిన ఈ జ్ఞాపకాల లేఖ కచ్చితంగా అపురూపమైందని చెప్పక తప్పదు.

Updated Date - 2022-07-05T01:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising