ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల బతుకమ్మను చూశాం.. కానీ ఐస్ బతుకమ్మను చూశారా?

ABN, First Publish Date - 2022-09-28T17:58:26+05:30

బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. తెలంగాణకే అందం వచ్చేస్తుంది. ప్రధాన కూడళ్లన్నీ ఆకర్షణీయమైన బతుకమ్మలతో ఆహ్వానం పలుకుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. తెలంగాణకే అందం వచ్చేస్తుంది. ప్రధాన కూడళ్లన్నీ ఆకర్షణీయమైన బతుకమ్మలతో ఆహ్వానం పలుకుతుంటాయి. అందమైన భామలంతా ఒకరిని మించి మరొకరు ముస్తాబై.. తీరొక్క పూలతో అంతకంటే అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆట, పాటలతో సందడి చేస్తారు. తొమ్మిది రోజుల పాటు.. ఊరూ, వాడా అన్న తేడా లేకుండా.. కుల, మతాల పట్టింపు లేకుండా అంతా ఒక్కచోట చేరి పోతారు. ఈ పండుగ భూమితో, జలంతో ఉన్న మానవ అనుబంధాన్ని తెలియజేస్తుంది.


అయితే ఇప్పటి వరకూ మనం ఎన్నో బతుకమ్మలను చూశాం. సృష్టిలో ఇన్ని రకాల పూలున్నాయా? అనిపిస్తుంది ఆ బతుకమ్మలను చూస్తుంటే. ముఖ్యమైన పూలు.. తంగేడు, గునుగు పూలతో పాటు మరెన్నో రకాల పూలు బతుకమ్మలో ఒదిగిపోతాయి. కొన్ని పట్టణాల్లో పేపర్లతోనూ బతుకమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకైతే మనం చూసినవి ఇవి రెండే. మూడో రకం బతుకమ్మ హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో రూపు దిద్దుకుంది. అదే.. ఐస్ బతుకమ్మ. ఐస్‌ను అందంగా కార్వింగ్ చేసి బతుకమ్మ ఆకారానికి తీసుకొచ్చారు. అనంతరం ఆ ఐస్ కార్వింగ్‌ను పూలతో అలంకరించారు. దీంతో ఐస్ బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.


Updated Date - 2022-09-28T17:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising