ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: తరగతి గదికి మందు బాటిళ్లు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు.. ఒక వ్యక్తి నిలదీయడంతో ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-10-04T00:28:07+05:30

విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మహత్తర బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మహత్తర బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది. అందుకే తల్లి, తండ్రి తర్వాత గురువుకు పెద్దలు సముచిత స్థానం ఇచ్చారు. అయితే కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన తమ వృత్తికే మచ్చను తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. అంతేకాదు తరగతిలోనే మద్యం సేవించేందుకు బాటిళ్లను కూడా తీసుకెళ్లాడు.


ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని హత్రాస్ స్థానిక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు మద్యం సేవించి హాజరయ్యాడు. అంతేకాదు తనతో పాటు మద్యం బాటిళ్లను కూడా క్లాసులోకి తీసుకెళ్లాడు. తరగతి గదిలో పిల్లల ఎదురుగానే ఆ బాటిళ్లను పెట్టాడు. ఒక వ్యక్తి ఉపాధ్యాయుడి చేష్టలను గమనించి నిలదీశాడు. దీంతో ఉపాధ్యాయుడు మందుబాటిళ్లను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. అక్కడ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ టీచర్ నిర్వాకం మొత్తాన్ని ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ ఉపాధ్యాయుడిపై విద్యా శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.  

Updated Date - 2022-10-04T00:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising