ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haryana Cop With Axe: గొడ్డలితో రెచ్చి పోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. నడిరోడ్డుపై వీరంగం!

ABN, First Publish Date - 2022-08-03T21:41:18+05:30

ఎండనకా, వాననకా రోడ్లపై నిలబడి వాహనదారులను కంట్రోల్ చేయడం సామాన్యమైన విషయం కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండనకా, వాననకా రోడ్లపై నిలబడి వాహనదారులను కంట్రోల్ చేయడం సామాన్యమైన విషయం కాదు. ఆ పని చేసే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ (Haryana Cop) అప్పుడప్పుడూ సహనం కోల్పోతుంటారు. తీవ్ర అసహనానికి గురవుతుంటారు. అయితే హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ (traffic cop with axe) డ్యూటీ సమయంలో సహనం కోల్పోయి నడి రోడ్డుపై వీరంగం చేశాడు. గొడ్డలి పట్టుకుని వాహనదారులను బెదిరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. 


ఇది కూడా చదవండి..

Greater Noida: ఆరు నెలలుగా సహజీవనం.. చివరకు అసలు విషయం తెలుసుకుని నివ్వెరపోయిన యువతి..


ఆ వీడియో ప్రకారం.. ఒక బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. బైక్ నడిపే యువకుడు హెల్మెట్ పెట్టుకోలేదు. వారిని చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. చేత్తో గొడ్డలి పట్టుకుని వారి వైపు దూసుకెళ్లాడు. వారిని కాలితో తన్నుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవటం, ఒక బైక్‌పై ముగ్గురు ఎక్కడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అలా చేసినట్లు తెలుస్తోంది. 


వీడియో వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు ఆ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. వీడియోలోని వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు. ఆ గొడ్డలిని వాహనదారుల నుంచే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాక్కున్నట్టు సమాచారం. పూర్తి విచారణ జరిపించి సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-08-03T21:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising