ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Scotch Whiskey : మంత్రి పేరిట స్కాచ్ విస్కీ బాటిళ్లు డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారి

ABN, First Publish Date - 2022-08-19T17:09:46+05:30

మంత్రి ఆధ్వర్యంలో(Ministers Name) జరగనున్న విందు కార్యక్రమం కోసం 15 ఏళ్ల పాత ‘గ్లెన్‌ఫిడ్డిచ్’ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు(Demands Scotch Whiskey) ఆరు పంపించాలని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌స్పెక్టర్ సందీప్ పై బదిలీ వేటు

గురుగ్రామ్ : మంత్రి ఆధ్వర్యంలో(Ministers Name) జరగనున్న విందు కార్యక్రమం కోసం  15 ఏళ్ల పాత ‘గ్లెన్‌ఫిడ్డిచ్’ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు(Demands Scotch Whiskey) ఆరు పంపించాలని మద్యం దుకాణ యజమానిని సాక్షాత్తూ ఓ ఎక్సైజ్ డిపార్టుమెంట్(Excise Official) ఇన్‌స్పెక్టర్ సందీప్ లోహాన్ డిమాండ్ చేసిన ఆడియో క్లిప్ తాజాగా బయటపడింది.ఎక్సైజ్ డిపార్టుమెంట్ ఇన్‌స్పెక్టర్ సందీప్ లోహాన్ ఆగస్టు 14వతేదీన సాయంత్రం గురుగ్రామ్(Gurgaon)లోని సెక్టార్ 47 వద్ద ఉన్న మద్యం దుకాణం ఉద్యోగికి ఫోన్ చేసి మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న విందు కార్యక్రమం కోసం  15 ఏళ్ల పాత ‘గ్లెన్‌ఫిడ్డిచ్’ స్కాచ్ విస్కీ ఫుల్ బాటిళ్లు ఆరు పంపించాలని డిమాండ్ చేశారు. 


మద్యం దుకాణం ఉద్యోగి స్కాచ్ విస్కీ బాటిళ్లు లేవని సమాధానం ఇవ్వడంతో సందీప్ నానా గొడవ చేశాడు. రెండో రోజు సాయంత్రం మద్యం దుకాణానికి వచ్చిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వినియోగదారుల ముందే బూతులు తిట్టి మద్యం దుకాణాన్ని బలవంతంగా మూసివేయించారు.ఈ ఘటనపై మద్యం షాపు యజమాని అనూజ్ ఎక్సైజ్ కమిషనరుకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అనూజ్ సీఎం, హోంశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు పంపించారు.( complaint to Chief Minister Window (grievance redressal system), vigilance department, Home Minister and other officials)


దీంతో ఇన్‌స్పెక్టర్ సందీప్ పై బదిలీ వేటు(transfer) వేశామని జిల్లా ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్ రవీందర్ సింగ్ చెప్పారు. పంచకులలోని హెడ్ క్వార్టరుకు సందీప్ ను బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ సందీప్ లోహాన్ పై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు వివరించారు.


Updated Date - 2022-08-19T17:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising