ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 ఏళ్ల ఈ యువతికి జూన్ 11న పెళ్లి.. వరుడు అసలే లేడు కానీ ఈమె ఎవరిని పెళ్లాడబోతోందో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-06-02T20:07:57+05:30

ఆ 24 ఏళ్ల ఈ యువతి జూన్ 11న పెళ్లికి సిద్ధమవుతోంది.. కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకోబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ 24 ఏళ్ల ఈ యువతి జూన్ 11న పెళ్లికి సిద్ధమవుతోంది.. కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకోబోతోంది.. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలిస్తే షాకవడం ఖాయం.. ఎందుకంటే ఆమె పెళ్లిలో వరుడు లేడు.. ఆమె తనను తానే పెళ్లి చేసుకుంటోంది.. అంతేకాదు ఆమె ఒక్కతే హనీమూన్ కోసం గోవా వెళ్తోంది.. దేశంలోనే ఇలాంటి పెళ్లి ప్రథమం అని ఆమె చాలా సంతోషంగా చెబుతోంది.


ఇది కూడా చదవండి..

Viral Video: చోరీకి వెళ్లిన దొంగకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా పోలీసుల ఎంట్రీతో కొత్త ప్లాన్.. మూడో అంతస్తు నుంచి వేళాడుతూ..


గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు అనే యువతి ఈ నెల 11న తనను తాను పెళ్లి చేసుకోబోతోంది. `వైవాహిక జీవితంలోకి ప్రవేశించి భాగస్వామితో కలిసి ఉండాలనే కోర్కె అసలు లేదు. కాకపోతే వధువులా ముస్తాబు కావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అందుకే నా తల్లిదండ్రుల సమక్షంలో నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నాను. ఇలాంటి పెళ్లి దేశంలో ఇది వరకు జరగలేదు. భారత్‌లో నాదే తొలి సెల్ఫ్-మ్యారేజ్` అని బిందు చెప్పింది. 


`చాలా మంది తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ఈ ప్రపంచంలో నాకు నచ్చిన వ్యక్తిని నేనే. నన్ను నేను ఎలాంటి షరతులూ లేకుండా స్వీకరించగలను. అందుకే నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి తర్వాత రెండు వారాల పాటు హనీమూన్ కోసం గోవా వెళ్తాన`ని బిందు తెలిపింది. 




Updated Date - 2022-06-02T20:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising