ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి వేడుకలో వరుడి పక్కనే కూర్చున్న స్నేహితుడు.. ఎవరూ చూడటం లేదనుకుని చేతివాటం చూపించాడు.. కానీ చివరకు..

ABN, First Publish Date - 2022-04-07T23:05:29+05:30

కళ్లు మూసుకుని పాలుతాగే పిల్లి తనను ఎవరూ చూడటం లేదని పొరబడుతుంది. స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన వ్యక్తి కూడా అచ్చం ఇదే విధంగా పొరబడ్డాడు. కానీ కెమెరా కంటికి చిక్కడంతో నవ్వులపాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కళ్లు మూసుకుని పాలుతాగే పిల్లి  తనను ఎవరూ చూడటం లేదని పొరబడుతుంది. స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన వ్యక్తి కూడా అచ్చం ఇదే విధంగా పొరబడ్డాడు. కానీ కెమెరా కంటికి చిక్కడంతో నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ స్నేహితుడి వివాహ వేడుకలో సదరు వ్యక్తి ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే..



పెళ్లంటే సరదాలు, సంతోషాలతో కూడిన వేడుక. వధూవరులు ఆనందంగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతూ.. వారి సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశంతో  బంధువులు, సన్నిహితులు, స్నేహితులను ఆహ్వానిస్తారు. ఇలా వచ్చిన అతిథులు.. వధూవరులు ఇద్దరూ జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు చెబుతారు. కానీ కొందరు మాత్రం ఇదే అదునుగా భావించి.. తమ చేతివాటాన్ని చూపిస్తుంటారు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. తన స్నేహితుడి వివాహ వేడుకకు హాజరయ్యాడు. వరుడి పక్కనే కూర్చుని.. డబ్బులు కాజేశాడు. వరుడి మెడలో ఉన్న నోట్ల దండలోంచి డబ్బును చోరీ చేశాడు. అయితే ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో చివరికి నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీ మీమ్‌లను జత చేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. 






Updated Date - 2022-04-07T23:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising