ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి వేడుకలో బంధువులందరి ముందే దుస్తులు విప్పి వరుడు రచ్చ రచ్చ.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ.. చివరకు..

ABN, First Publish Date - 2022-06-24T21:22:36+05:30

పెళ్లి వైభవంగా జరుగుతోంది.. వధూవరులు ఏడడుగులు కలిసి నడిచారు.. అయితే అప్పటికే వరుడి ప్రవర్తన మీద వధువు తరఫు వారికి అనుమానం మొదలైంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి వైభవంగా జరుగుతోంది.. వధూవరులు ఏడడుగులు కలిసి నడిచారు.. అయితే అప్పటికే వరుడి ప్రవర్తన మీద వధువు తరఫు వారికి అనుమానం మొదలైంది.. వరుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారికి అనిపించింది.. అందుకే వధువును అత్తింటికి పంపలేమని చెప్పారు.. దీంతో వరుడు తీవ్ర ఆగ్రహానికి గురై బంధువులందరి ముందు తన దుస్తులను విప్పి పడేసి పెద్దగా అరవడం ప్రారంభించాడు. వరుడిని అతడి కుటుంబ సభ్యులు బస్సు సీటుకు కట్టేసి తమ వెంట తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

కాబోయే అత్త ప్రవర్తన నచ్చలేదట.. ప్రేమించిన వాడితో పెళ్లిని రద్దు చేసుకున్న యువతి కథ ఇదీ..!


వరుడి కుటుంబం బుధవారం రాత్రి నర్సింగపూర్ జిల్లా నుంచి దామోహ్‌కు ఊరేగింపుగా చేరుకుంది. కచోరా బజార్‌లో ఉన్న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో వివాహ వేడుకలు జరిగాయి. వివాహ వేడుకల్లో వరుడు వింతగా ప్రవర్తించాడు. వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఇదంతా చూస్తూనే ఉన్నారు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. అయితే చివరకు వరుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలుసుకున్నారు. అతడితో తమ కూతురిని పంపేందుకు నిరాకరించారు. 


విషయం తెలుసుకున్న వరుడు తీవ్ర ఆగ్రహానికి గురై బంధువులందరి ముందు తన దుస్తులను విప్పి పడేసి పెద్దగా అరవడం ప్రారంభించారు. వరుడిని అతడి కుటుంబ సభ్యులు బస్సు సీటుకు కట్టేసి తమ వెంట తీసుకెళ్లారు. వరుడి కుటుంబం తమను మోసం చేసిందని వధువు కుటుంబ సభ్యులు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

 

Updated Date - 2022-06-24T21:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising