ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ వీడియో: పెళ్లి మండపానికి జెసీబీలో వెళ్లిన వరుడు

ABN, First Publish Date - 2022-01-26T10:45:57+05:30

ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా భావించే పెళ్లి రోజున అన్నీ గొప్పగా జరగాలనుకుంటాడు. కానీ మనిషి ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది అన్నట్లు ఒక యువకుడు తన పెళ్లి రోజున కల్యాణ మండపానికి కారులో బయలు దేరాడు.. అయితే దారిలో మంచు తుఫానుతో రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో అతను వింత ఉపాయంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా భావించే పెళ్లి రోజున అన్నీ గొప్పగా జరగాలనుకుంటాడు. కానీ మనిషి ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది అన్నట్లు  ఒక యువకుడు తన పెళ్లి రోజున కల్యాణ మండపానికి కారులో బయలు దేరాడు.. అయితే దారిలో మంచు తుఫానుతో రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో అతను వింత ఉపాయంతో ముందుకుసాగాడు.


వివరాల్లోకి వెళితే.. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో ఒక మంచు తుఫాన్ వచ్చింది. దాంతో రోడ్డంతా మంచుతో బ్లాక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెళ్లికొడుకు తన ఇంటి నుంచి పెళ్లి కోసం బయలుదేరాడు. కానీ ఒకచోట కారు ఇరుక్కుపోయింది. కారు ముందుకు సాగడం కష్టమైపోయింది. అలాంటి సమయంలో అతను ఎలాగైనా కల్యాణ మండపానికి చేరాలనుకొని ఒక జెసీబీ బుక్ చేసుకున్నాడు. అలాగే తన స్నేహితుల కోసం కూడా ఒక జేసీబీ బుక్ చేసి వారిని కూడా అందులో పెళ్లి ముహూర్తానికి చేరుకోమన్నాడు. 


ఆ వరుడు జేసీబీలో మంచును పక్కకు తీస్తూ ముహూర్తం సమయానికి చేరుకున్నాడు. ఆ తరువాత పెళ్లి చేసుకొని నవవధువుతో మళ్లీ అదే జేసీబీలో తిరిగి వచ్చాడు. ఈ ఘటనని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-26T10:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising