ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కార్యక్రమంలో అందరూ చూస్తుండగా.. వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-01-25T09:42:17+05:30

ఒక పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో వధూవరులు స్టేజీపైన కూర్చొని ఉండగా.. పెళ్లికూతురు స్నేహితుడు అక్కడికి వచ్చి తనతో డాన్స్ చేయమని ఆమెతో చెప్పాడు. ఆ తరువాత ఆమె అందరి ముందు స్టేజీ అదరిపోయేలా డాన్స్ చేసింది. ఇది చూసి చిర్రెత్తిన పెళ్లికొడుకు నవవధువు అని కూడా చూడకుండా అక్కడే ఆమెపై చేయి చేసుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో వధూవరులు స్టేజీపైన కూర్చొని ఉండగా.. పెళ్లికూతురు స్నేహితుడు అక్కడికి వచ్చి తనతో డాన్స్ చేయమని ఆమెతో చెప్పాడు. ఆ తరువాత ఆమె అందరి ముందు స్టేజీ అదరిపోయేలా డాన్స్ చేసింది. ఇది చూసి చిర్రెత్తిన పెళ్లికొడుకు నవవధువు అని కూడా చూడకుండా అక్కడే ఆమెపై చేయి చేసుకున్నాడు. తన భార్య అందరి ముందు సిగ్గు లేకుండా అలా డాన్స్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. పెళ్లికొడుకు అందరి ముందు తనను కొట్టడం భరించలేని పెళ్లికూతురు ఆ తరువాత ఏం చేసిందంటే..


తమిళనాడు రాష్ట్రంలోని కుడులోర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఒక పెళ్లి కార్యక్రమంలో జరిగిన గొడవ వల్ల ఆ పెళ్లి పెటాకులైంది. అసలేం జరిగిందంటే.. పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో వధూవరులు స్టేజీపైన కూర్చొని ఉండగా.. పెళ్లికూతురు స్నేహితుడు అక్కడికి వచ్చి తనతో డాన్స్ చేయమని ఆమెని కోరాడు. ఆ తరువాత పెళ్లి కూతురు తన ఫ్రెండ్‌తో కలిసి స్టేజీపై అదరగొట్టేలా డాన్స్ వేసింది. అందరూ ఆమె చేసిన డాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. కానీ వరుడికి మాత్రం తన భార్య అలా అందరి ముందు డాన్స్ చేయడం నచ్చక కోపంతో ఆమె చెంపపై లాగి కొట్టాడు. 


ఆ తరువాత పెళ్లికూతురు అతనితో వివాహం రద్దు చేసుకుంటున్నానని అందరి ముందు చెప్పింది. దీంతో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. అంతేకాదు పెళ్లికూతురు అదే పెళ్లికి వచ్చిన మరొక వ్యక్తితో మరుసటి రోజే పెళ్లి చేసుకుంది. 

ఇలాంటిదే మరొక సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. అక్కడ జరుగుతున్న వివాహంలో పెళ్లికొడుకు చేయి చూసి అది నచ్చలేదని పెళ్లికూతురు వివాహం కాన్సెల్ చేసుకుంది. వధూవరులు ఒక ఫంక్షన్‌లో ఒకరికొకరు పసుపు పూయాలి. ఆ సమయంలో పెళ్లికొడుకు తన చేత్తో వధువుకు పసుపు పూయబోగా.. అతని చేతికున్న రెండు వేళ్లు చూసి పెళ్లికూతురు ఆశ్చర్యపోయింది. వరుడి చేతికి మూడు వేళ్లు లేవనే విషయం తనతో దాచారని.. అందుకు అతనితో పెళ్లి చేసుకునేది లేదని ఆమె స్పష్టంగా చెప్పింది. 

Updated Date - 2022-01-25T09:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising