ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wedding: ప్రమాదానికి గురై నడవలేని వధువును వరుడు ఎత్తుకొని ఏడు అడుగులు వేశాడు

ABN, First Publish Date - 2022-12-07T05:41:47+05:30

Wedding: ప్రమాదానికి గురై నడవలేని వధువును వరుడు ఎత్తుకొని ఏడు అడుగులు వేశాడు....

Wedding
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ (గుజరాత్): ప్రమాదానికి గురై కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వధువును వరుడు ఎత్తుకొని ఏడు అడుగులు వేసి పెళ్లాడిన ఉదంతం(Sath Pheras) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad) నగరంలో వెలుగుచూసింది.(Wedding) అహ్మదాబాద్ నగరం పటాన్ ప్రాంతానికి చెందిన రీన్‌లాబాతో మహావీర్ సింగ్ కు మూడేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది.

వధువు(Bride) రీన్‌లాబా ఆరు నెలల క్రితం స్నేహితురాళ్లతో ఆడుకుంటుండగా చెట్టు మీద నుంచి కింద పడి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వధువు శరీరం కదల్చలేని పరిస్థితుల్లో ఉంది.దీంతో మహావీర్ తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వస్తాయని భయపడిన వధువు తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆందోళన చెందారు. కుటుంబసభ్యులు సమావేశమై పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తన పుట్టినరోజున మహావీర్ రీన్‌లాబాపై తన ప్రేమను అంగీకరించాడు.

తాను నిశ్చితార్థం చేసుకున్న వధువు రీన్ లాబా ఎలా ఉన్నా ఆమెనే వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు వరుడు చెప్పాడు. తల్లిదండ్రులు వ్యతిరేకించినా వరుడు మాత్రం వెనక్కితగ్గకుండా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వధువును తన చేతులతో ఎత్తుకొని(Groom Carries) ఏడు అడుగులు వేసి పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం నడవలేని స్థితిలో ఉన్న వధువును వరుడు ఎత్తుకొని ఏడు అడుగులు వేసి వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నాడు.

Updated Date - 2022-12-07T07:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising