ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి వేడుక జరుగుతుండగా... వరుని తల్లి ఆ మాట చెప్పింది... వరుడు సరేనన్నాడు... అతిథులంతా విస్తుపోయారు.... ఏం జరిగిందంటే...

ABN, First Publish Date - 2022-07-28T15:58:44+05:30

అక్కడ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆనందాలు విరబూసే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కడ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆనందాలు విరబూసే వాతావరణం నెలకొంది, అతిథులు వస్తూపోతూ ఉన్నారు. ఇంతలో వరుడు అలాంటి నిర్ణయం తీసుకోవడంతో వధువు తరఫువారు కంగుతిన్నారు. వారి ముఖంలోని ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. పెళ్లి రోజునే వరుడు ఈ పెళ్లి సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నాడు. తన తల్లి కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత, వధువు భావోద్వేగంతో కూడిన పోస్ట్ షేర్ చేసింది. వధువు తాను 'అనాథ'గా మారానని సోషల్ మీడియాలో తెలియజేసింది. తన పెళ్లి సన్నాహాలకు చాలా డబ్బు ఖర్చయింది. 


వరుడి నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వధువు తెలిపింది. వధువు పోస్ట్‌ను చూసినవారంతా వరుణ్ణి, అతని తల్లిని విమర్శిస్తున్నారు. వాస్తవానికి వరుడి తల్లి తనకు కాబోయే కోడలు ఫొటోను మాత్రమే చూసింది. ఆ ఫొటోను చూసి పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే పెళ్లి రోజున వధువును తొలిసారిగా చూసినవారు ఆమె గురించి హీనంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ పెళ్లిని రద్దు చేసి, వేడుకలను రద్దు చేయాలని కోరాడు. వరుని తల్లి వధువు అందంగా లేదని కామెంట్ చేశారు. 'ది మిర్రర్' కథనం ప్రకారం ఈ సంఘటన ట్యునీషియాలో చోటుచేసుకుంది. వరుడి తల్లి వధువును కురూపి అంటూ విమర్శించింది. పెళ్లి రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కొడుకు కూడా తల్లి సలహా మేరకు వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. ఇది చూసి అక్కడున్న అతిథులు కంగుతిన్నారు. అయితే వరుడి పేరు మాత్రం స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే పెళ్లి రోజు నాటి ఫొటోలలో వధువు లామియా అల్-లాబావి నవ్వుతూ కనిపించింది. ఆమె కాబోయే భర్త సూటు,బూటులో కనిపిస్తున్నాడు. వివాహం ఆగిపోయిన నేపధ్యంలో లామియా అల్-లాబావి బ్లాగ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని రాసింది. అందులో తాను అనాథను అయ్యానని పేర్కొంది. పెళ్లికి భారీగానే ఖర్చు చేశామని పేర్కొంది. పెళ్లి ఆగిపోవడంతో షాక్‌కు గురయ్యానని తెలిపింది. లామియా పోస్ట్‌ను చూసిన యూజర్స్ ఆమెకు మద్దతు పలుకుతూ వరుణ్ణి తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ఆమెకు మద్దతు పలుకుతూ ‘మీ తల పైకెత్తండి మీ స్వశక్తితో ప్రపంచాన్ని ఎదుర్కోండి’ అని పేర్కొన్నాడు. మరొక యూజర్ ‘ఏదో ఒకరోజు మీకు మంచి భర్త లభిస్తాడని’ పేర్కొన్నాడు. 

Updated Date - 2022-07-28T15:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising