ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లిమంటపానికి తీసుకెళ్లేందుకు వరుడు పంపిన వాహనాన్ని చూసి అవాక్కైన వధువు..!

ABN, First Publish Date - 2022-04-22T09:36:34+05:30

ఆధునిక జీవనంలో మనుషులు సంస్కృతి, సంప్రదాయాలను మరిచి ఫ్యాషన్ బాట పడుతున్నారు. పెళ్లి చేయాలంటే సంప్రదాయాలను గాలికి వదిలి డబ్బుని దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఓ చదువుకున్న యువకుడు సమాజానికి ఇది తప్పు అని చెప్పాలనుకున్నాడు. అతను పైగా ఒక డాక్టర్. అతను తలుచుకుంటే తన పెళ్లి కోసం ఎంతో ఖర్చుపెట్టగలడు. కానీ అలా చేయలేదు. పెళ్లికూతురిని తీసుకొచ్చేందుకు ఏదైనా కాస్ట్లీ కారులో రాగలడు.. కానీ అతడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆధునిక జీవనంలో మనుషులు సంస్కృతి, సంప్రదాయాలను మరిచి ఫ్యాషన్ బాట పడుతున్నారు. పెళ్లి చేయాలంటే సంప్రదాయాలను గాలికి వదిలి డబ్బుని దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఓ చదువుకున్న యువకుడు సమాజానికి ఇది తప్పు అని చెప్పాలనుకున్నాడు. అతను పైగా ఒక డాక్టర్. అతను తలుచుకుంటే తన పెళ్లి కోసం ఎంతో ఖర్చుపెట్టగలడు. కానీ అలా చేయలేదు. పెళ్లికూతురిని తీసుకొచ్చేందుకు ఏదైనా కాస్ట్లీ కారులో రాగలడు.. కానీ అతడు తన సంప్రదాయం.. గ్రామీణ నేపథ్యం దర్శించేలా వధువు కోసం ఒక ఎద్దుల బండిలో వచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధువులంతా అది చూసి షాకయ్యారు.


వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ రాష్ట్రాలోని బెతూల్ పట్టణానికి చెందిన డాక్టర్ రాజా ఘుర్వే అనే యువకుడు ఇటీవల వివాహం చేసుకున్నాడు. అతను డాక్టర్‌తో పాటు మోటివేషనల్ స్పీకర్ కూడా. అతను పర్యావరణ కాలుష్యం, డబ్బు దుబారా ఖర్చు చేయకూడదంటూ ఇంతకు ముందు ప్రచారాలు చేశాడు. ఇటీవల డాక్టర్ ఘుర్వే బేతుల్ పట్టణానికి సమీపంలో ఉన్న అసాడీ గ్రామంలో వివాహం చేసుకున్నాడు. అయితే వివాహానికి అతను కారుకు బదులు ఒక ఎద్దుల బండిలో వెళ్లాడు. ఆ బండిని చాలా అందంగా అలకరించాడు. అది చూసిన బంధువులు, మిత్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వివాహం జరిగాక వధువుని వరుడు ఆ ఎద్దుల బండిలోనే తన ఇంటికి తీసుకెళ్లాడు. 


ఎద్దుల బండిలో రావడానికి గల కారణాలను వరుడు అందరికీ వివరించాడు. ఎద్దుల బండిలో పెళ్లికి రావడం.. మన గ్రామీణ సంస్కృతిలో భాగమని.. పైగా అది కాలుష్య రహితమని చెప్పాడు. పెట్రల్, డీజిల్ ధరలు పెరిగి జనజీవనంపై భారం కావడంతో వాటి ఉపయోగాన్ని తగ్గించాలని కూడా సూచించాడు. 


Updated Date - 2022-04-22T09:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising