ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహం జరిగిన తొలిరాత్రి వరుడి గురించి విషయం తెలిసి షాక్‌లో పెళ్లికూతురు.. మ్యాటర్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-02-24T05:50:42+05:30

ఎన్నో ఆశలతో ఆ యువతి ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన తొలిరాత్రే ఆమె ఊహించని షాక్ తగిలింది. ఆ నవవరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మరో యువతి జీవితాన్ని నాశనం చేశాడని పోలీసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నో ఆశలతో ఆ యువతి ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన తొలిరాత్రే ఆమె ఊహించని షాక్ తగిలింది. ఆ నవవరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మరో యువతి జీవితాన్ని నాశనం చేశాడని పోలీసులు చెప్పడంతో ఆ నవవధువు నిర్ఘాంతపోయింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జష్పూర్ పట్టణంలో నివసించే అనిరుధ్ కుమార్ సింగ్(26) అనే యువకుడికి ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. అయితే మరుసటి రోజు పెళ్లికూతురిని అనిరుధ్ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి అతను తన భార్య వద్దకు గదిలో వెళుతుండగా.. అనుకోకుండా ఇంటికి పోలీసులు వచ్చారు. అనిరుధ్‌పై ఒక మహిళ ఫిర్యాదు చేసిందని.. అందువల్ల అతడిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు.


అనిరుధ్ అరెస్టుతో అతని కుటుంబసభ్యులు, నవవధువు ఆందోళనతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ పోలీసులు వివరంగా చెప్పింది విని ఒక్కాసరిగా షాకయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. అనిరుధ్ కుమర్ సింగ్ గత నాలుగేళ్లుగా ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శృంగారం చేసేవాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భవతి కూడా అయింది. అయితే.. అనిరుధ్ ఆ యువతికి గర్భస్రావం(అబార్షన్) చేయించాడు. ఆ తరువాత ఆమెను వివాహం చేసుకోనని చెప్పి మోసం చేశాడు. దీంతో ఆ యువతి అనిరుధ్‌తో గొడవ పడేది. తన జీవితం నాశనం చేస్తే ఊరుకునేది లేదని చెప్పింది. కానీ అనిరుధ్ ఆమెను పట్టించుకోకుండా ప్రస్తుతం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన ఆ యువతి పోలీసులకు అనిరుధ్‌పై ఫిర్యాదు చేసింది.


ప్రస్తుతం పోలీసులు అనిరుధ్‌ని అరెస్టు చేసి అతనిపై అత్యాచారం, చీటింగ్ కేసులు నమోదు చేశారు.




Updated Date - 2022-02-24T05:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising