ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్-2కి గూగుల్ ప్రత్యేక నివాళి.. మీరు గమనించారా లేదా?

ABN, First Publish Date - 2022-09-11T22:32:08+05:30

బ్రిటన్‌ను దీర్ఘకాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-II (Queen Elizabeth II) గత గురువారం కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్‌ను దీర్ఘకాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-II (Queen Elizabeth II) గత గురువారం కన్నుమూశారు. ఎలిజబెత్ మరణంపట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. దేశాధినేతలు, రాజకీయ, దౌత్య, క్రీడా, సినీ రంగాలకు చెందిన సెలబ్రెటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు చాలామంది తమతమ సంతాపాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ జాబితాలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్(Google) కూడా చేరింది.



సంతాప సూచకంగా గూగుల్(google) తన హోమ్ పేజీ రంగులను మార్చివేసింది. కలర్‌ఫుల్ లోగోని గ్రే కలర్‌లోకి మార్చింది. వైట్‌బ్యాక్ గ్రౌండ్‌లో  గ్రే కలర్‌‌తో లోగోని ప్రదర్శించింది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇండియాలో కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయ యూజర్లు ఈ విషయాన్ని గుర్తించారు. అయితే అవగాహనలేని కొందరికి గూగుల్ హోం పేజీ రంగులు ఎందుకు మారాయో తెలియదు. మరోవైపు ఎలాంటి డూగుల్‌నీ గూగుల్ ప్రదర్శించలేదు. కాగా అంతకుముందు గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్(Sunder pichaiah) ట్విటర్ వేదికగా రాణి ఎలిజబెత్-2 మరణం పట్ల సంతాపం ప్రకటించారు. యూకే ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వ్యాఖ్యానించారు.


కాగా మరో టెక్ దిగ్గజం యాపిల్(Apple) తన హోం పేజీని మార్చింది. క్విన్ ఎలిజబెత్-2 చిన్నప్పటి ఫొటోతోపాటు స్మృతి సందేశాన్ని పంచుకుంది. ఈ మేరకు యాపిల్ వెబ్‌సైట్‌లో ఎలిజబెత్ ఫొటో కనిపిస్తోంది.


Updated Date - 2022-09-11T22:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising