ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాయ్‌ఫ్రెండ్ బెయిల్ కోసం అప్పు చేసిన యువతి.. అప్పు తీర్చేందుకు అతను ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-04-10T17:54:18+05:30

అతను ఒక దొంగ.. ఖరీదైన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ దొంగిలించి వాటిని అమ్ముతుంటాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఒక దొంగ.. ఖరీదైన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ దొంగిలించి వాటిని అమ్ముతుంటాడు.. ఆ డబ్బులతో గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు.. ఆరు నెలల క్రితం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. అతడికి బెయిల్ ఇప్పించేందుకే గాళ్‌ఫ్రెండ్ రూ.40 వేలు అప్పు తీసుకుంది.. బాయ్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకువచ్చింది.. అయితే అప్పు తిరిగి తీర్చకపోవడంతో ఆ యువతికి వేధింపులు మొదలయ్యాయి.. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఆమెను టార్చర్ చేయడం ప్రారంభించారు. దీంతో బాయ్‌ఫ్రెండ్ మళ్లీ దోపిడీకి పాల్పడి అరెస్ట్ అయ్యాడు.  


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన విశాల్ అనే వ్యక్తి ఖరీదైన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ దొంగిలిస్తుంటాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేస్తుంటాడు. గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఆరు నెలల క్రితం ఓ చోరీ కేసులో విశాల్ అరెస్ట్ అయ్యాడు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు రూ.40 వేలు అవసరమయ్యాయి. దీంతో విశాల్ గాళ్‌ఫ్రెండ్ వడ్డీకి రూ.40 వేలు అప్పు తెచ్చి బాయ్‌ఫ్రెండ్‌ను విడిపించింది. 


అప్పు తిరిగి తీర్చకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు వేధింపులు ప్రారంభించారు. అప్పు తీర్చేందుకు విశాల్ మళ్లీ దొంగతనానికి సిద్ధపడ్డాడు. తనకు అలవాటైన రీతిలో మొబైల్స్, ల్యాప్‌టాప్స్ చోరీ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విశాల్‌పై నిఘా వేశారు. చోరీ చేస్తుండగా అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. బెయిల్ రద్దు చేసి విశాల్‌పై మరో కేసు పెట్టారు. 

Updated Date - 2022-04-10T17:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising