ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఓ యువతికి షాకింగ్ అనుభవం.. సడన్‌గా Car Window లో నుంచి తల దూర్చిన Ostrich.. చివరకు..

ABN, First Publish Date - 2022-06-18T02:37:52+05:30

ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మిసిసిప్పీలోని సఫారీ వైల్డ్ యానిమల్ పార్క్‌ను సందర్శించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మిసిసిప్పీలోని సఫారీ వైల్డ్ యానిమల్ పార్క్‌ను సందర్శించింది.. కారులో కూర్చుని స్నాక్స్ తింటున్న సమయంలో ఆమెకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది.. ఆహారం కోసం అన్వేషిస్తున్న ఓ నిప్పుకోడి ఆమె ఉన్న కారులోకి తలదూర్చింది.. దీంతో ఆ యువతి భయానికి గురై కేకలు వేసింది.. అయినా ఆ నిప్పుకోడి అక్కడి నుంచి వెళ్లకుండా ఆమె చేతిలో ఉన్న స్నాక్స్ తీసుకుని తినడం ప్రారంభించింది.. ఆ ఘటనను ఆమె బాయ్‌ఫ్రెండ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియో వైరల్‌గా మారింది. 


కోమోకు చెందిన క్లోయ్ అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సఫారీ వైల్డ్ యానిమల్ పార్క్‌‌కు వెళ్లింది. ఇద్దరూ కారులో కూర్చుని స్నాక్స్ తింటున్న సమయంలో ఓ ఆస్ట్రిచ్ అక్కడకు వచ్చింది. ఆ యువతి చేతిలోని ప్యాకెట్ చూసి తన తలను కారులోకి దూర్చింది. దీంతో క్లోయ్ భయంతో కేకలు వేసింది. అయినా ఆ నిప్పుకోడి అక్కడి నుంచి వెళ్లకుండా క్లోయ్ చేతిలో ఉన్న స్నాక్స్ తినడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతసేపు భయంతో కేకలు పెట్టిన క్లోయ్ ఆ తర్వాత పగలబడి నవ్వింది. ఆ ఘటనను ఆమె బాయ్‌ఫ్రెండ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియో వైరల్‌గా మారింది.



Updated Date - 2022-06-18T02:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising