ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతను ఆమెను ప్రేమ పేరుతో రెండేళ్ల పాటు తన చుట్టూ తిప్పించుకున్నాడు... మోసపోయానని తెలుసుకున్న ఆమె అతని తండ్రి దగ్గరకు వెళ్లి...

ABN, First Publish Date - 2022-07-26T15:04:52+05:30

ఒక యువతి తన రిలేషన్‌షిప్ గురించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక యువతి తన రిలేషన్‌షిప్ గురించి షాకింగ్‌కు గురిచేసే విషయాన్ని వెల్లడించింది. తనకు ఓ యువకునితో రిలేషన్‌షిప్ ఉందని, అయితే అతను మోసం చేస్తున్నాడని తెలిసి అతని తండ్రిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో గురించి అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన అగస్టా హబుల్ మాట్లాడుతూ తాను 2014 నుండి ఒక యువకుని ప్రేమలో ఉన్నానని, అప్పటికి తన వయసు 21 ఏళ్లు, అతనికి 30 ఏళ్లు అని తెలిపింది. 


అతను మొదట్లో పర్ఫెక్ట్ జెంటిల్‌మన్ గా ఉండేవాడని పేర్కొంది. అతను ప్రతి వారం తన కోసం పూలు తెచ్చేవాడని, బహుమతులు ఇచ్చేవాడని, పెళ్లి చేసుకోవాలని అడిగాడని కూడా తెలిపింది. రెండేళ్ల పాటు తమ సంబంధం సజావుగానే సాగిందని, అయితే హబుల్ మోసం చేస్తున్నాడని మెల్లగా తెలిసిందన్నారు. అతను ఫేస్‌బుక్‌ ద్వారా మరొక యువతిని కలుసుకున్నాడని, నిలదీయగా తన తప్పును ఒప్పుకున్నాడని తెలిపింది. తరువాత కూడా ఇలానే జరగడంతో తాము విడిపోయామని చెప్పింది. ఆ తరువాత అతని తండ్రిపై ఇష్టం పెంచుకుని, అతనిని వివాహం చేసుకున్నానని తెలిపింది. ఇటీవలే తమ ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నామని, ఈ సందర్భంగా తన మాజీ ప్రియునికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని పేర్కొంది. ఎందుకంటే అతని కారణంగానే తనకు నిజమైన ప్రేమ దొరికిందని తెలిపింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-26T15:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising