ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి రద్దు చేశారనే కోపంతో వరుడు ఎంత పని చేశాడంటే.. రాత్రి సమయంలో వధువు ఇంటికి వెళ్లి..

ABN, First Publish Date - 2022-01-30T19:20:44+05:30

వారిద్దరికీ పెళ్లి కుదిరింది.. మరో రెండు నెలల్లో వివాహ ముహూర్తం కూడా పెట్టుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరికీ పెళ్లి కుదిరింది.. మరో రెండు నెలల్లో వివాహ ముహూర్తం కూడా పెట్టుకున్నారు.. అయితే వరుడికి తాగుడు వ్యసనం ఉందనే కారణంతో వధువు తరఫు వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు.. దీంతో వరుడు ఆగ్రహానికి గురయ్యాడు.. అర్ధరాత్రి సమయంలో అమ్మాయి ఇంటికి వెళ్లి బయట పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను తగలబెట్టేశాడు.. అలాగే బయట ఉన్న వస్తువులను కూడా అగ్నికి ఆహుతి చేశాడు.. రాజస్థాన్‌లోని బన్స్‌వారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


రాజస్థాన్‌లోని బన్స్‌వారా ప్రాంతానికి సమీపంలో ఉన్న దుంగాపూర్ గ్రామానికి చెందిన ఛగన్‌లాల్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన భూరీ మీనాతో వివాహం కుదిరింది. మార్చి నెలలో వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే ఛగన్‌లాల్ మద్యానికి బానిస అనే విషయం తెలిసి మీనా కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకుని ఛగన్‌లాల్ ఆగ్రహానికి గురయ్యాడు. 


ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో మీనా ఇంటికి వెళ్లాడు. బయట పార్క్ చేసి ఉన్న స్కూటీ, బైక్‌ను తగలబెట్టేశాడు. అలాగే బయట ఆరేసి ఉన్న బట్టలను, ఇతర సామాన్లను కూడా మంటల్లో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మీనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-01-30T19:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising