ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనవరాలిని అడ్డు పెట్టుకుని తాతను బ్లాక్‌మెయిల్.. రూ.9 లక్షలు ఇచ్చినా కనికరించలేదు.. పోలీసులను ఆశ్రయిస్తే..

ABN, First Publish Date - 2022-02-04T19:28:23+05:30

అతను ఒక రిటైర్డ్ ఉద్యోగి.. కొడుకు, కూతురు, మనవరాలితో కలిసి జీవిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఒక రిటైర్డ్ ఉద్యోగి.. కొడుకు, కూతురు, మనవరాలితో కలిసి జీవిస్తున్నాడు.. కొడుకు మానసిక రోగి కావడంతో 87 ఏళ్ల వయసులోనూ ఆ వృద్ధుడు కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు.. ఇటీవల అతని 15 ఏళ్ల మనవరాలికి ఆపద తలెత్తితింది.. ఆమె బట్టలు మార్చుకుంటుండగా వీడియో చిత్రీకరించిన కొందరు దుండగలు దానిని నెట్‌లో పెడతామని బెదిరింపులు మొదలుపెట్టారు.. తాము అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.. రూ.9 లక్షలు ఇచ్చినా వారు కనికరించలేదు.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 


హర్యానాలోని రోహ్‌తక్‌కు సమీపంలోని ఓ గ్రామంలో తాత, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న 15 ఏళ్ల బాలకను ఓ గ్యాంగ్ ట్రాప్ చేసింది. తమ గ్యాంగ్‌లోని అమ్మాయికి ఆ బాలికతో స్నేహం కుదిరేలా చేసింది. కొన్ని రోజుల తర్వాత తన ఇంట్లో ఆ బాలిక బట్టలు మార్చుకుంటూ ఉండగా ఆ అమ్మాయి వీడియో తీసింది. దానిని తన గ్యాంగ్ సభ్యులకు అందించింది. అప్పట్నుంచి వారు ఆ బాలిక తాతను బెదిరించడం ప్రారంభించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను నెట్‌లో పెడతామని బెదిరించారు. 


దీంతో ఆ వృద్ధుడు వారు అడిగినంత డబ్బును పలు దఫాల్లో చెల్లించాడు. అలా మొత్తం రూ.8.7 లక్షలు ఇచ్చాడు. అంత డబ్బు తీసుకున్నా కూడా ఆ గ్యాంగ్ ఇంకా డబ్బుల కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆ వృద్ధుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-02-04T19:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising