ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌లో ఉంటూ 16 ఏళ్ల బాలిక నీట్ కోచింగ్‌.. తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-06-09T17:10:51+05:30

ఆ బాలిక నీట్ కోచింగ్ తీసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్‌లోని కోటాకు వెళ్లింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక నీట్ కోచింగ్ తీసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్‌లోని కోటాకు వెళ్లింది.. అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయింది.. రాత్రి సమయంలో రోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేది.. రెండ్రోజుల క్రితం తల్లి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు.. దీంతో కంగారుపడిన తల్లి హాస్టల్ యాజమాన్యానికి, కోటా పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగించిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. 


ఇది కూడా చదవండి..

15 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల అంకుల్‌ను కత్తితో పొడిచి చంపేసింది.. అసలు కారణమేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..!



ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ఆలియా అనే యువతి నీట్ కోచింగ్ కోసం రాజస్థాన్‌లోని కోటాకు వెళ్లింది. అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయింది. ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా గుజరాత్‌కు చెందిన యువకుడితో పరిచయమైంది. ఇద్దరూ తరచుగా ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు. రెండ్రోజుల క్రితం ఆలియాను కలిసేందుకు ఆ యువకుడు గుజరాత్ నుంచి కోటా వెళ్లాడు. హాస్టల్ నుంచి కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన ఆలియా అక్కడి నుంచి ఆ యువకుడి బైక్ ఎక్కి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లన్నింటినీ పరిశీలించిన పోలీసులు వారిద్దరూ కోటాకు సమీపంలోని ఆటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు తెలుసుకున్నారు. 


ఆ అడవిలోకి వెళ్లి అన్వేషించగా అక్కడ ఆలియా మృతదేహం లభ్యమైంది. ఆలియాను ఆ యువకుడే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆలియా మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆలియా తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుజరాత్ వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. 

Updated Date - 2022-06-09T17:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising