ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి పిలిచి అవమానించాడని వరుడిపై స్నేహితుడి ఆగ్రహం.. రూ.50లక్షల పరిహారం కొరతూ కోర్టుకు!

ABN, First Publish Date - 2022-06-30T17:01:03+05:30

స్నేహితుడు తన పెళ్లికి పిలవడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర స్నేహితులను కూడా వివాహానికి తీసుకొచ్చే బాధ్యతను అప్పగించడంతో ఉప్పొంగిపోయాడు. మిత్రుడి పెళ్లిలో తనదే హవా అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: స్నేహితుడు తన పెళ్లికి పిలవడంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర స్నేహితులను కూడా వివాహానికి తీసుకొచ్చే బాధ్యతను అప్పగించడంతో ఉప్పొంగిపోయాడు. మిత్రుడి పెళ్లిలో తనదే హవా అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. దీంతో అతడు తన స్నేహితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి నుంచి పరిహారం కోరుతూ కోర్టు ఆశ్రయించాడు. కాగా.. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరాఖండ్‌‌లోని హరిద్వార్‌కు చెందిన రవి అనే యువకుడికి కొద్ది రోజుల క్రితం ఓ యువతితో వివాహం కుదిరింది. దీంతో రవి తన పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చంద్రశేఖర్‌ను కలిసి, పెళ్లికి ఆహ్వానించాడు. అంతేకాకుండా ఇతర స్నేహితులకు కూడా పెళ్లి విషయం చెప్పి, పెళ్లికి తీసుకురావాల్సిందిగా కోరాడు. బరాత్‌లో హంగామా చేయాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ఉప్పొంగిపోయాడు. తనకు బాధ్యతలు అప్పగించడంపట్ల సంతోషం వ్యక్తం చేసి, బరాత్‌కు ఇతర స్నేహితులను తీసుకొస్తానని వరుడికి హామీ ఇచ్చాడు. స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం.. ఇతర స్నేహితులను తీసుకుని చంద్రశేఖర్.. ఆహ్వాన పత్రికలో పేర్కొన్న సమయానికి రవి ఇంటికి చేరుకున్నాడు.



బరాత్ ఘనంగా జరిపించాలనే ఆలోచనతో వెళ్లి వరుడిని కలిశాడు. అయితే.. వరుడు చెప్పిన మాటలకు అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. బరాత్ కార్యక్రమం అయిపోయిందని చెప్పడంతో చంద్రశేఖర్ తెల్లముఖం వేశాడు. అవమాన భారంతో ఇతర స్నేహితులను తీసుకుని వెనక్కి వచ్చేశాడు. అనంతరం చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి పిలిచి అవమానించారని పేర్కొంటూ రవికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన పరవు నష్టానికి రవి నుంచి రూ.50లక్షలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. అంతేకాకుండా అందరి ముందు తనకు క్షమాపణ చెప్పేలా వరుడిని ఆదేశించాలని అభ్యర్థించాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 


Updated Date - 2022-06-30T17:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising