ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Food delivery appలో సాంకేతిక సమస్య.. వినియోగదారులకు ఉచితంగా ఆహారం, ఆల్కహాల్..

ABN, First Publish Date - 2022-07-10T01:55:59+05:30

ఫుడ్ డెలివరీ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కొన్ని వందల మంది వినియోగదారులకు వరంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫుడ్ డెలివరీ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కొన్ని వందల మంది వినియోగదారులకు వరంగా మారింది. ఆ యాప్ ద్వారా ఫుడ్, ఆల్కహాల్ ఆర్డర్ చేసిన వారందరూ ఉచితంగానే వాటిని అందుకున్నారు. అమెరికాకు చెందిన ఫుడ్ డెలివరీ యాప్ DoorDashలో గురువారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. అందువల్ల  వినియోగదారులు పేమెంట్ చేయకుండానే ఆ యాప్ ఆర్డర్లను స్వీకరించింది. దీంతో చాలా మంది ప్రజలు చాలా ఖరీదైన ఆర్డర్లు చేసి వాటిని అందుకున్నారు. 


ఇది కూడా చదవండి..

`నా గాళ్‌ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది`, `కుక్క నా లైసెన్స్ తినేసింది`.. Traffic Violationsపై పోలీసుల ప్రశ్నలకు నెటిజన్ల ఫన్నీ సమాధానాలు!


ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోక్‌లు, మీమ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. తాము ఉచిత ఆహారం, ఆల్కహాల్ పొందలేకపోయామని కొందరు నిరాశ వ్యక్తం చేశారు. ఒక వినియోగదారుడు ఏకంగా రూ.1.5 లక్షల విలువైన డాన్ జూలియో రెపోసాడో టకీలాను ఉచితంగా పొందాడు. అయితే సంస్థ ప్రతినిధులు వెంటనే ఈ సమస్యను గుర్తించి సరిదిద్దారు. ఎంతసేపు ఈ సమస్య తలెత్తిందో స్పష్టంగా తెలియలేదు. 


`జులై 7 సాయంత్రం డోర్‌డాష్ చెల్లింపు ప్రాసెసింగ్ సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా, కొంతమంది వినియోగదారులు తక్కువ వ్యవధిలో అధీకృత చెల్లింపు పద్ధతి లేకుండా చెక్ అవుట్ చేయగలిగారు. ప్రాసెసింగ్ లోపాన్ని పరిష్కరించాం. మోసపూరిత ఆర్డర్‌లను రద్దు చేయడానికి, వ్యాపారులకు పరిహారం చెల్లించడానికి తాము కృషి చేస్తున్నామ`ని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

Updated Date - 2022-07-10T01:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising