ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flipkart బిగ్ మిస్టేక్.. పండగ వేళ కస్టమర్‌ను వరించిన అదృష్టం.. iPhone 13ను‌ ఆర్డర్ పెడితే..

ABN, First Publish Date - 2022-10-07T15:56:28+05:30

Flipkart.. బిగ్ మిస్టేక్ చేసింది. ఈకామర్స్ సంస్థ చేసిన పొరపాటుతో పండగ వేళ ఓ కస్టమర్‌ను అదృష్టం వరించింది. iPhone 13 ఆర్డర్ పెట్టిన కస్టమర్.. ప్లిప్‌కార్ట్ చేసిన పనికి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజనం స్పందిస్తున్నారు. ‘Flipkart ఎప్పుడూ తప్పులే కాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: Flipkart.. బిగ్ మిస్టేక్ చేసింది. ఈకామర్స్ సంస్థ చేసిన పొరపాటుతో పండగ వేళ ఓ కస్టమర్‌ను అదృష్టం వరించింది. iPhone 13 ఆర్డర్ పెట్టిన కస్టమర్.. ప్లిప్‌కార్ట్ చేసిన పనికి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజనం స్పందిస్తున్నారు. ‘Flipkart ఎప్పుడూ తప్పులే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుందన్నమాట’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటని ఆలోచిస్తున్నారా? అది తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 


ఫ్లిప్‌కార్ట్..  Big Billion Days సేల్స్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. సెప్టెంబర్ 23-30 మధ్య సెల్‌ఫోన్‌లు, గృహోపకరణాలు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్ల ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే iPhoneలపై బంపర్ డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో చాలా మంది ఐఫోన్ లవర్స్.. ఆ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా సేల్స్‌లో iPhone 13 తక్కువ ధరకే రావడంతో దాన్ని కొనడానికి జనాలు పోటీ పడ్డారు. విపరీతంగా iPhone 13 ఫోన్‌లను ఆర్డర్ చేశారు. ఇలా ఆర్డర్ పెట్టిన చాలా మందిని ఫ్లిప్‌కార్ట్ మోసం చేసింది. రకరకాల కారణాలతో ఆర్డర్‌లను క్యాన్సిల్ చేసింది. 



కానీ ఓ వ్యక్తికి మాత్రం Flipkart భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. iPhone 13 ఆర్డర్ పెడితే.. తాజాగా ఐఫోన్ 14ను డెలివరీ చేసింది. తాజాగా మార్కెట్‌లోకి విడుదలైన iPhone 14ను కేవలం రూ.49వేలకే కస్టమర్‌కు అందించింది. Flipkart నుంచి ఐఫోన్ 14 మొబైల్ రావడంతో సదరు కస్టమర్ ఎగిరి గంతేశాడు. కాగా.. ఈ విషయాన్ని అశ్విన్ హెగ్దే అనే  టెక్ న్యూస్ యూట్యూబర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. అశ్విన్ హెగ్దే పెట్టిన పోస్ట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఐఫోన్ 13, iPhone 14 ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు కదా. అందుకే iPhone 13కు బదులు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14‌ను డెలివరీ చేసిందేమో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




Updated Date - 2022-10-07T15:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising