ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: మత్య్సకారులకు దొరికిన రూ.28కోట్ల విలువైన తిమింగలం వాంతి!

ABN, First Publish Date - 2022-07-24T15:26:40+05:30

ఎప్పటిలాగే చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్య్సకారులకు(Fishermen) కోట్లాది రూపాయలు విలువ చేసే పదార్థం దొరికింది. దీంతో ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు.. ఆ పదార్థాన్ని కోస్టల్ పోలీసులకు అప్పగించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్య్సకారులకు(Fishermen) కోట్లాది రూపాయలు విలువ చేసే పదార్థం దొరికింది. దీంతో ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు.. ఆ పదార్థాన్ని కోస్టల్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళలోని తిరువనంతపురానికి చెందిన కొందరు మత్స్యకారులు ఎప్పటిలాగే శుక్రవారం కూడా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే అత్యంత విలువైన 28.4కిలోల తిమింగలం(Whale) వాంతి వారి కంట పడింది. వెంటనే దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చిన మత్స్యకారులు.. స్థానికంగా ఉన్న కోస్టల్ పోలీసులకు అప్పగించారు. అధికారులు ఆ పదార్థాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. మత్స్యకారులకు దొరికింది నిజంగా తిమింగలం వాంతేనా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించడానికి ఫారెస్ట్ అధికారులు దాన్ని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ((RGCB)కి తరలించారు. ఇదిలా ఉంటే.. తిమిగింలం వాంతికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కేజీ తిమింగలం వాంతికి సుమారు కోటి రూపాయల ధర పలుకుంది. దీన్ని ఎక్కువగా ఫర్ఫ్యూమ్‌(Perfume)ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 


Updated Date - 2022-07-24T15:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising