ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడోకంటికి తెలియకుండా ఒక కుర్రాడిని రెండేళ్ల పాటు ఇంటిలో దాచిన మహిళా టీచర్!

ABN, First Publish Date - 2022-10-27T12:02:59+05:30

ఒక మహిళా టీచర్ చేసిన పని ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఇంటి నుంచి పారిపోయిన ఒక పిల్లవాడిని ఆమె తన ఇంటిలో దాచివుంచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక మహిళా టీచర్ చేసిన పని ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. ఇంటి నుంచి పారిపోయిన ఒక పిల్లవాడిని ఆమె తన ఇంటిలో దాచివుంచింది. ఆ పిల్లవాడు తన ఇంటికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలోనే రెండేళ్ల పాటు రహస్యంగా ఉన్నాడు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం. కాగా ఉన్నట్టుండి తమ పిల్లవాడు మాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కుర్రాడిని వెదికేందుకు ఎంతగానో శ్రమించారు. అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మాయమైన కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్ తల్లే ఆ టీచర్.

61 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు క్యాస్టిలో ఓలివరేస్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటోంది. ఆమె మైకేల్ రమీరెజ్ (ఆ కుర్రాడు)ని తన ఇంటిలో దాచి ఉంచింది. ఆ కుర్రాడు తన ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు అతని వయసు 15 ఏళ్లు. ఆ కుర్రాడు తన అంకుల్ ఇంటిలో ఉండేవాడు. అంకుల్ అతనిని ఇబ్బందులకు గురిచేసేవాడు. 2020 నవంబరు 9న ఆ కుర్రాడు అదృశ్యమయ్యాడంటూ అంకుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కుర్రాడిని వెదికేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే ఆ కుర్రాడి అత్త స్కూలు టీచర్ ఓలివరేస్‌పై అనుమానం వ్యక్తం చేసింది. అయితే రెండేళ్ల తరువాత ఆ కుర్రాడు తన అంకుల్, ఆంటీల దగ్గరకు వచ్చాడు. ఈ సమాచారం పోలీసులకు చేరింది. వారు ఆ టీచర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-10-27T12:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising