ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్న కొడుకును కిరాతకంగా చంపేసిన తండ్రి.. కారణమేంటో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN, First Publish Date - 2022-06-03T22:30:08+05:30

వారిద్దరూ మైనర్లు.. ఇద్దరికీ కనీసం 18 ఏళ్లు కూడా నిండకుండానే పెద్దలు వారికి పెళ్లి చేసేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ మైనర్లు.. ఇద్దరికీ కనీసం 18 ఏళ్లు కూడా నిండకుండానే పెద్దలు వారికి పెళ్లి చేసేశారు.. పెళ్లైన వెంటనే ఆ బాలిక గర్భం దాల్చింది.. ఏడాదికి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.. మైనారిటీ కూడా తీరకుండానే వాళ్లిద్దరూ తల్లిదండ్రులుగా మారిపోయారు.. అది ఆ కుర్రాడిలో అసంతృప్తి రగిలించింది.. తనకు అప్పుడే పిల్లలు వద్దనుకున్నాడు.. పుట్టిన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు.. గత నెల 25వ తేదీ రాత్రి తన నెలన్నర వయసున్న కొడుకుని ఓ చెరువులో విసిరేశాడు.. అనంతరం తనకేం తెలియనట్టు నాటకం ఆడాడు.. చివరకు పోలీసుల ఎదుట నిజం అంగీకరించాడు. 


ఇది కూడా చదవండి..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి.. తర్వాత అసలు విషయం తెలిసి షాక్!


ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలుడికి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నెల రోజులకే ఆ బాలిక గర్భం దాల్చింది. నెలన్నర క్రితం ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తను అప్పుడే తండ్రి కావడం ఆ టీనేజీ కుర్రాడికి నచ్చలేదు. దీంతో తన కొడుకును చంపెయ్యాలనుకున్నాడు. అందుకోసం యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. గత నెల 25వ తేదీ రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో తన నెలన్నర కొడుకును తీసుకుని చెరువులో విసిరేశాడు. 


తర్వాతి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ కుర్రాడిని కూడా స్ట్రిక్ట్‌గా విచారించారు. ఆ కుర్రాడు తరచుగా తన స్టేట్‌మెంట్లు మారుస్తుండడం పోలీసుల్లో అనుమానం కలిగించింది. దీంతో వారు తమదైన శైలిలో విచారించగా ఆ కుర్రాడు నిజం చెప్పేశాడు. దీంతో పోలీసులు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-06-03T22:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising