ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన నాలుగేళ్లకే కొడుకు దుర్మరణం.. కోడలినే కూతురిగా భావించి ఏడాదిలోపే మరో పెళ్లి చేసిన అత్తమామలు..!

ABN, First Publish Date - 2022-06-30T19:06:49+05:30

కుమారుడికి పెళ్లీడు రావడంతో తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిని చూసి పెళ్లి జరిపించారు. అయితే.. పెళ్లైన నాలుగేళ్లకే కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రలు శోకసంద్రంలో ముని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కుమారుడికి పెళ్లీడు రావడంతో తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిని చూసి పెళ్లి జరిపించారు. అయితే.. పెళ్లైన నాలుగేళ్లకే కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రలు శోకసంద్రంలో మునిగిపోయారు. తర్వాత ఆ బాధ నుంచి తేరుకుని.. కీలక నిర్ణయం తీసుకున్నారు. కోడలినే కూతురుగా భావించి.. ఆమెకు మరో పెళ్లి చేశారు. బిహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బిహార్‌లోని ఛప్రా ప్రాంతానికి చెందిన సురేంద్ర ప్రసాద్ షా దంపతులు తమ కుమారుడు చందన్‌ కుమార్‌కు ఛాందిని కుమారి అనే యువతితో 2017 డిసెంబర్‌లో వివాహం జరిపించారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 2021 జూన్ 9న ప్రమాదవశాత్తు చందన్ కుమార్ మరణించాడు. భార్య ఛాందిని కుమారితోపాటు అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మెల్లిమెల్లిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చిన సురేంద్ర ప్రసాద్ దంపతులు.. కోడలి భవిష్యత్తు గురించి ఆలోచించారు. ఆమె జీవితం అగమ్యగోచరంగా మారొద్దని భావించి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులుగా మారి.. కోడలి కోసం పెళ్లి సంబంధాలు చూశారు. ఈ నేపథ్యంలో.. నవీన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా ఆమె పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. ఈ పెళ్లికి సంబంధించిన  ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ.. సురేంద్ర ప్రసాద్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది మేలో మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.  కొడుకు కరోనా చనిపోగా.. ప్రకాశ్ తివారి, రాగిణి తివారి దంపతులు ఒంటరైన కోడలుకు అండగా నిలిచారు. తల్లిదండ్రులుగా మారి ఆమెకు వివాహం జరిపించిన విషయం తెలిసిందే.


Updated Date - 2022-06-30T19:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising