ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్తమానం ఫోన్ పట్టుకుని కూర్చుంటున్న కూతురు.. అనుమానం వ్యక్తం చేసిన తండ్రి.. చివరకు విషయం తెలిసి ఆమెను..

ABN, First Publish Date - 2022-04-07T22:05:41+05:30

వయసొచ్చిన కూతురు అస్తమానం ఫోన్ పట్టుకునే కాలక్షేపం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె వైఖరిపై తండ్రికి అనుమానం కలిగింది. ఆమెపై నిఘా పెట్టాడు. చివరికి కూతురుకు సంబంధించిన ఓ విషయం అతడికి తెలిసిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వయసొచ్చిన కూతురు అస్తమానం ఫోన్ పట్టుకునే కాలక్షేపం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె వైఖరిపై తండ్రికి అనుమానం కలిగింది. ఆమెపై నిఘా పెట్టాడు. చివరికి కూతురుకు సంబంధించిన ఓ విషయం అతడికి తెలిసింది. దీంతో ఆ తండ్రి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానలోని సోనిపట్‌ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిందనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. యువతి మెట్ల మీద నుంచి పడటం వల్ల చనిపోలేదని.. ఆమెను గొంతు నులిమి చంపేసినట్టు వెల్లడైంది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. కుటుంబ సభ్యులను తమదైన స్టైల్‌లో విచారించారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి నూర్ మహ్మద్ తన తప్పు ఒప్పుకున్నాడు. తన కూతురును తానే హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. అస్తమానం ఫోన్ పట్టుకుని ఉంటుండంతో అనుమానం వ్యక్తం చేసినట్టు చెప్పాడు. ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడినట్టు గుర్తించి తట్టుకోలేకపోయినట్టు పేర్కొన్నాడు. పరువు పోతుందని భావించి ఆమెను హత్య చేసినట్టు వివరించాడు. దీంతో నూర్ మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2022-04-07T22:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising