ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పగవాడికి కూడా రాకూడని కష్టమిది.. 4 ఏళ్ల కూతురి శవాన్ని భుజాన వేసుకుని మండుటెండలో 5 కిలోమీటర్లు నడిచిన తండ్రి..

ABN, First Publish Date - 2022-06-10T20:19:18+05:30

ఆ నాలుగేళ్ల చిన్నారి పోషకాహార లోపం కారణంగా అనారోగ్యానికి గురైంది.. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికి మరణించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ నాలుగేళ్ల చిన్నారి పోషకాహార లోపం కారణంగా అనారోగ్యానికి గురైంది.. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికి మరణించింది.. తిరిగి తన కూతురి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి అష్టకష్టాలు పడ్డాడు.. చేతిలో డబ్బులు లేకపోవడంతో కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని మండుటెండలో 5 కిలోమీటర్లు నడిచాడు.. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంబంధిత అధికారులు స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన పాప ఇప్పుడెలా ఉందో చూశారా..? సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టిన Sonu Sood


ఛత్తార్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక రాధ మూడ్రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించింది. డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ చేస్తారని భయపడి తండ్రి ఆ బాలిక మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి భుజాన వేసుకున్నాడు. వాహనంలో తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో రహస్యంగా ఆర్టీసీ బస్సులో ఆ చిన్నారి మృతదేహాన్ని తీసుకుని బయల్దేరాడు. దామోహ్‌లో బస్ దిగి తన స్వగ్రామానికి కాలి నడకన బయలుదేరాడు. మండుటెండలో దాదాపు 5 కిలో మీటర్లు నడిచి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. 


విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారిణి స్పందించారు. మొత్తం ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు.   

Updated Date - 2022-06-10T20:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising