ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌లోకి పాములు వదిలిన రైతులు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-02-28T18:34:45+05:30

అది జిల్లా కలెక్టర్ కార్యాలయం.. పటిష్టమైన భద్రత ఉండే ప్రాంతం.. అలాంటి కార్యాలయంలో ఉన్నట్టుండి ఓ పాము ప్రత్యక్షమైంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది జిల్లా కలెక్టర్ కార్యాలయం.. పటిష్టమైన భద్రత ఉండే ప్రాంతం.. అలాంటి కార్యాలయంలో ఉన్నట్టుండి ఓ పాము ప్రత్యక్షమైంది.. అక్కడే కాదు.. ఆ ప్రాంతంలోని మిగతా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ హఠాత్తుగా పాములు ప్రత్యక్షమవుతున్నాయి.. ఇలా కలెక్టర్ కార్యాలయంలోనూ, ప్రభుత్వ ఆఫీస్‌ల్లోనూ పాములను వదులుతున్నది రైతులే. 12 గంటల విద్యుత్ కోసం రైతులు తమ నిరసనను ఈ రీతిలో వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. 


మహారాష్ట్రలో రాత్రి వేళల్లో మాత్రమే ప్రభుత్వం వ్యవసాయం కోసం ఉచిత కరెంటు అందిస్తోంది. దాంతో ఎంతో మంది రైతులు రాత్రిపూట పాముకాట్లకు బలైపోయారు. అలాగే చీకటిలో విద్యుత్ షాక్‌లకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. దీంతో రాత్రిపూట కాకుండా పగటి పూట 12 గంటల విద్యుత్ సరఫరా కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతు సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. 


వచ్చేది వేసవి కావడంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో తమ సమస్యలను బలంగా చెప్పాలని రైతులు ఈ మార్గం ఎంచుకున్నారు. కొల్హాపూర్‌లోని విద్యుత్ డిస్కమ్ ఆఫీసు ఎదుట గత ఐదు రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారు. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోకే రైతులు పాములను వదులుతున్నారు. రెండ్రోజుల క్రితం డిస్కమ్ ఆఫీస్‌లో ఓ ఉన్నతాధికారి టేబుల్‌ పైకి పామును విసిరారు. ఆదివారం రాత్రి కొల్హాపూర్ కలెక్టరేట్‌లోకి కూడా పాములు వదిలారు.

Updated Date - 2022-02-28T18:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising